ఇంత చిన్న పండులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

Divya
చూడటానికి చిన్నగా, ఎర్రగా కనిపించే చెర్రీ పండులో శరీరానికి కావాల్సిన పోషకాలాన్ని పుష్కళంగా ఉన్నాయి.వీటిని ఎక్కువగా కేకులు, ఊరగాయలు ,జామ్‌లలో ఉపయోగిస్తారు.ఇవి రుచికి కొంచెం తియ్యగా,కొంచెం పుల్లగా ఉండటం వల్ల చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వల్ల ఆరోగ్యానికి ఎంతో బాగా సహాయపడతాయి.ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

 గుండె సంబంధిత రోగాలు తగ్గించుకోవడానికీ..
 చెర్రీ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల,రక్తాన్ని శుద్ధి చేసి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.అంతేకాక ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల గుండె జబ్బులు, పేరాలసిస్ వంటి రోగాలు దరి చేరకుండా సహాయపడుతుంది.

చెడుకొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి..
చెర్రీ పండ్లలో నీటిలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కాలేయం స్రవించే కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. తద్వారా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది.
ఎముకలను దృఢపర్చుకోవడానికి..
చెర్రీ పండ్లలోని బోరాన్ మన ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది.బోన్ డేన్సిటి ని పెంచుతుంది. అంతే కాకుండా ఆస్తియోపొరోసిస్ రాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా వీటిని వయసు మళ్ళిన వారు తీసుకోవడం వల్ల, వారి ఎముకలు బలంగా తయారవుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..
చెర్రీ పండ్లను ఈ చలికాలంలో తీసుకోవడంవల్ల జలుబు, ఫ్లూ వంటి రోగాలను నిరోధించడానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంతే కాక మెటబాలిజంను పెంచుతుంది.
జుట్టు రాలడం తగ్గించడానికి..
చెర్రీ పండ్లు అడ్రినల్ గ్రంథి అలసటను నివారిస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.ఇందులోని విటమిన్ ఈ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. రోజూ చెర్రీ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు యవ్వనంగా కనిపిస్తారు.
జీర్ణ క్రియ మెరుగుపరుచుకోవడానికి..
చెర్రీ పండ్లలో ఇసాటిన్ ,సార్బిటాల్ వంటి రసాయన సమ్మేళనలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా దోహదపడతాయి. వీటిని తరుచూ తీసుకోవడం వల్ల ,మలబద్ధకం, ఆజీర్తి, కడుపు నొప్పి, ఆసిడిటి, గ్యాస్, ఉబ్బరం,ఎలిక పాముల సమస్యలు వంటి సమస్యలకు తొందరగా ఉపశమనం కలిగిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: