ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..!!

Divya
ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి,చెడు వ్యసనాలు వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం దెబ్బతింటోంది. దానివల్ల చాలామంది శ్వాస సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఎక్కువగా నీరు త్రాగటం అలవాటు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఊపిరితిత్తులు సాధారణంగా దెబ్బతింటే వచ్చే జబ్బులు ఆస్తమా, క్యాన్సర్, క్షయ, న్యుమోనియా వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల ఊపిరితిత్తుల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాయి.అంతేకాక ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వల్ల రోజురోజుకి ఊపిరితిత్తులలో పనిచేసే సామర్థ్యం నశిస్తూవుంది . ఇలాంటి పరిస్థితుల్లో  పోషకాహారం మన ఊపిరితిత్తులను కాపాడగలవని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.మరి ఎటువంటి ఆహారాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయో ఇప్పుడు చూద్దాం..
వెల్లుల్లి
వెల్లుల్లినీ రోజూ వారి డైట్ లో చేర్చుకోవడం వాళ్ళ ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాక,ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి.
పాలకూర
పాలకూరలో  బీటా కెరోటిన్, క్లోరోఫిల్, జియాక్సంతిన్, లుటిన్ వంటి పోషకాలు శరీరానికి పుష్కళంగా అందుతాయి.ముఖ్యంగా క్లోరోఫిల్ వంటి యాంటీఆక్సిడెంట్ గుణాలు ఊపిరితిత్తులను ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతాయి.
ఎండుద్రాక్ష
ఎండు ద్రాక్షను రోజూ తగిన మొతాదులో తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు చాలా మేలు కలుగుతుంది. దాని కోసం  రాత్రంతా నానబెట్టిన ఎండు ద్రాక్షలు ఉదయం పరగడుపునే తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు ఆహార నిపుణులు.
టమోటా
టమాటా ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇందులోని లైకోపీన్ అనే పోషకం ఊపిరితిత్తులను ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి వ్యాధులను దరి చేరనీదు.
మెంతికూర
మెంతులు కషాయం ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడటంలో సహాయపడుతుంది.ఈ కషాయంను రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల కఫం తగ్గుతుంది.
పసుపు
పసుపులో కర్క్యుమిన్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కళంగా ఉంటాయి.ఇవి గాలికాలుష్యం వల్ల కలిగే ఊపిరితిత్తులవాపు అనే వ్యాధి నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
అల్లం
అల్లంలో జింజెరాల్ అనే రసాయన మూలకం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులలోని నెమ్ము మరియు కఫం తగ్గించడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: