ఇమ్యూనిటీ బుస్టర్ టీ ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసా..!

Divya
ఈ చలికాలంలో చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని రకరకాల రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి. వీటన్నిటికీ తగ్గించుకోవడానికి రోగనిరోధకశక్తి చాలా అవసరము. శరీరంలోని రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి కొన్ని రకాల మసాలాదినుసులు చాలా బాగా ఉపయోగపడతాయి. వాటితో తయారు చేసే కషాయం కానీ,టీ కానీ ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. అంతేకాక దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి బూస్టర్ టీ ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
బుస్టర్ టీ కీ కావాల్సిన పదార్థాలు..
ముందుగా ఒక గిన్నెలో బ్లాక్ టీ ఆకులు ఒక స్ఫూన్,
ఏలకులు 3 లేదా 4,లవంగాలు2, దాల్చిన చెక్కఅర అంగుళం,నల్ల మిరియాలు చిటికెడు,పొడవైన మిరియాలు చిటికెడు,తాజా అల్లం ముక్కలుఅర అంగుళం, పావు లీటర్ నీళ్ళు వేసి బాగా మరిగించాలి. ఆ తరవాత అందులో 2 గ్లాసుల గట్టిపాలు, తీపికి సరిపడా బెల్లం వేసుకొని, బాగా వుండికించాలి. దీనిని రోజుకు ఒక కప్పు చొప్పున ఏదొక సమయంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలాన్ని లభించి, రోగనిరోధకశక్తిని పెంచుతుంది.ఈ టీ తీసుకోవడం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఆందోళనను తగ్గించడానికి..
చాలామంది రకరకాల ఒత్తిడిల వల్ల, ఆందోళన చెందుతూ,మాటిమాటికి చిరాకు పడుతూ ఉంటారు. అలాంటివారు రోజుకు తగిన మొతాదులో ఈ టీ తీసుకోవడం వల్ల,ఇందులో ఉన్న మసాలా దినుసులు మెదడు కణజాలంపై ప్రభావం చూపి,డిప్రెషన్ ను తగ్గిస్తాయి.
 జీర్ణ సమస్యలు తొలగించడానికి..
 చాలామంది ఈ మధ్యకాలంలో అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు రోజుకో కప్పు ఈ టీ తాగడం వల్ల, ఇందులో ఉన్న అల్లం జీర్ణశక్తి పెంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి రోగాలను నివారిస్తుంది.
క్యాన్సర్ నివారణకు..
 ఇందులో వాడే మసాలా దినుసులలో, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, క్యాన్సర్ ని కలిగించే ఫ్రీరాడికల్స్ ని నిరోధిస్తాయి.
 కానీ ఈ టీ తగిన మోతాదులో తీసుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: