వాటర్ థెరపీ : ఎలా పాటించాలో తెలుసా..?

Divya
పంచభూతాలలో ఒకటైన నీరు... మనిషి జీవన మనుగడకు ఎంతో అవసరం.. ప్రాణాదారంగా గుర్తింపబడ్డ నీరు మానవుడికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. అయితే ఈ నీరు మన ఆరోగ్యానికి అన్ని విధాలా ప్రయోజనాలను అందించాలి అంటే సరైన సమయంలో సరైన మోతాదులో నీటిని తాగడం నేర్చుకోవాలి. దీనినే వాటర్ థెరపీ అని అంటారు. వాటర్ థెరపీ మనకు నీటిని ఎప్పుడు? ఎంత పరిమాణంలో? ఎలా తాగాలి ?అనే విషయాన్ని సూచిస్తుంది. అయితే ఇప్పుడు వాటర్ థెరపీ ని మనం ఎలా పాటించాలో ఒకసారి చదివి తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తప్పకుండా తీసుకోవాలి.  ఇలా చేయడం వల్ల దాహార్తి తీరడంతో పాటు శరీరంలోని అన్ని అవయవాలను ఉత్తేజపరిచి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను మలమూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఫలితంగా మలబద్ధక సమస్య కూడా దూరం అవుతుంది. మధ్యాహ్నం భోజనం చేసే అరగంట ముందు కూడా నీటిని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. స్నానం చేసే పది నిమిషాలు ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని తాగవద్దు. కావాలంటే అరగంట ముందు నీటిని తాగి స్నానం చేస్తే అధిక రక్త పోటును దూరం చేసుకోవచ్చు.
అలాగే బాగా అలసిపోయినట్టుగా మనకు అనిపిస్తే,మన శరీరంలో తగినంత నీరు లేదనడానికి సంకేతం లాగా భావించాలి. ఒక గ్లాసు నీటిని తీసుకోవడం ద్వారా ఆ నీరు మన శరీరాన్ని శక్తి వంతం చేయడానికి సహాయపడుతుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలను పొందవచ్చు. రాత్రి పడుకోబోయే ముందు  ఒక గ్లాస్ నీటిని తీసుకోవడం వలన ద్రవ నష్టాన్ని నివారించి, ఆకస్మాత్తుగా వచ్చే గుండెపోటు సమస్యలను  నివారించుకోవచ్చు.
అందువల్ల మనం ఎప్పుడూ తగినంత నీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నీరు తక్కువ అయినా లేదా ఎక్కువైనా ప్రమాదమే. అలాగే మనలో కొంతమంది ఆహారం తిన్న వెంటనే నీటిని తీసుకునే అలవాటు ఉంటుంది. ఇది ఏమంత మంచి అలవాటు కాదు. ఇలాంటి జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: