మానసిక ఒత్తిడి తగ్గడానికి ఇలా చెయ్యండి?

Purushottham Vinay
మానసిక ఒత్తిడి తగ్గడానికి ఇలా చెయ్యండి ?
ఇక ఆఫీసుల్లో ఇంకా ఇంట్లో అసలు ఏ మాత్రం విశ్రాంతి లేకుండా పనులు చేయడం ఇంకా అలాగే వివిధ పరిశ్రమల్లో పని చేయడం వల్ల ఖచ్చితంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ఇంకా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర ఖచ్చితంగా అవసరం. అలాంటి సమయంలో సరిగ్గా నిద్రలేకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి.ఖచ్చితంగా కూడా సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటివి తప్పకుండా పాటిస్తే ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చు.అసలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. మీకు వీలైనప్పుడు అందరితో కలిసిపోయేలా ఉండాలి.స్నేహితులతో ఎక్కువగా మాట్లాడుతుండాలి. ఇంకా మీకు ఏవైనా సమస్యలుంటే వారితో షేర్‌ చేసుకుంటే కొంత ఒత్తిడి అనేది దూరమవుతుంది. అలాగే ఎప్పుడు చీకటిలో ఉండకుండా ఫ్రీగా ఉండటం అలవాటు చేసుకోవాలి.

ఇంకా అంతేకాకుండా మానసిక ఒత్తిడికి   నిద్రలేమి సమస్య కూడా అనారోగ్యానికి ఈజీగా గురి చేస్తుంది. ఒత్తిడికి చాలా కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటి.చాలా మంది కూడా ఈ రోజుల్లో రోజూకు నాలుగైదు గంటలు మాత్రమే పడుకుంటారు.మనం ప్రతి రోజు కనీసం 8 గంటలైన నిద్రించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలను కూడా చూడడం, వినడం కాని అస్సలు చేయవద్దు.ఇక  ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసికంగా బాగా కుంగిపోతారు.దీంతో ఆనారోగ్య సమస్యలు చాలా ఈజీగా దరి చేరుతాయి. ఇలా అధిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.కొన్ని కొన్ని విషయాలను ఎక్కువగా ఆలోచించడం వల్ల అధిక ఒత్తిడికి గురై మీకు లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశాలుంటాయి.అలాగే మీరు వరుసగా పనులు చేస్తుంటే ఒత్తిడికి గురవుతుంటారు. అందుకే మీరు మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: