పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే యాలకులు..!

Divya
ఇటీవల కాలంలో పురుషులలో పూర్వకాలంతో పోలిస్తే శృంగార సామర్థ్యం కాస్త తగ్గుతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణంగా వారు తల్లిదండ్రులు కాలేకపోతున్నామనే బాధ కూడా కలుగుతోంది. అలాంటి సమస్యలతో బాధపడుతున్న మగవారు ఎక్కువగా ప్రతిరోజు యాలకులు తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సుగంధ ద్రవ్యాల్లో యాలకులది ప్రత్యేక స్థానం. దీని సువాసన ఎంతో పరిమళంగా ఉంటుంది. ఇవి భారత్ తో పాటు భూటాన్,నేపాల్,ఇండోనేషియా దేశాల్లో కూడా దొరుకుతాయి .యాలకులను రొట్టెల్లో, స్వీట్,టీ లేదా పాయసం వంటి వంటకాల్లో ఉపయోగిస్తారు. చూడటానికి చిన్నగా కనిపించే యాలకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా రెండు యాలకులను తినడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అలానే మన పూర్వీకులు వీటిని ఆయుర్వేదంలో విరివిగా వాడేవారు.
పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరగాలంటే క్రమం తప్పకుండా యాలకులను తినండి. ఇవి పురుషులలో శీఘ్రస్కలన   సమస్యలను నివారిస్తాయి. యాలకులలో సినేయిల్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషుల్లో నపుంసకత్వ లక్షణాలను నివారిస్తాయి. శృంగారంలో యాక్టివ్ గా ఉండేందుకు యాలకులు సహకరిస్తాయి.
యాలకులలో పొటాషియం,క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే యాలకుల్లో కావలసినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం గుండె పనితీరును, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం చేసే గుణాలు యాలకుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. కడుపులో ఏర్పడే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల్ని ఎదుర్కొనే లక్షణాలు యాలకుల్లో ఉంటాయి. యాలకుల జీవక్రియను వేగవంతం చేస్తాయి.
ఆస్తమాను కొద్దిగా అదుపులో ఉంచగలిగే గుణాలు ఉంటాయి. ఆకుపచ్చని యాలకులు గురక తగ్గించేందుకు సహాయపడుతాయి.వాతావరణ మార్పుల వలన వచ్చే దగ్గు,శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తగ్గేందుకు యాలకులు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి యాలకులను నిత్యం తీసుకుంటూ అనారోగ్య సమస్యలను దూరం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: