అల్లం యొక్క లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Divya
అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది.వంటింట్లో ఉన్న ఒక గొప్ప ఔషధాల్లో ఒకటి అల్లం. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను అల్లంతో బాగుపరచుకోవచ్చు. నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకపాత్ర పోషించే అల్లం అంటే బహుశా ఇష్టపడిన వారు.. ఉండరంటే అతిషయోక్తి కాదు.ఈ అల్లం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నో ఆరోగ్య సమస్యలకు అల్లం తో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. తాజా అల్లానికి బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంటుంది.మాములుగా బాక్టీరియా వృద్ధి చెందకుండా దోహదపడుతుంది .వైరస్ వ్యాప్తి చెందకుండా కూడా  సహాయపడుతుంది.నోటి ఆరోగ్యం కాపాడడంలో కూడా అల్లం కీలక పాత్ర వహిస్తుంది. నలుగురిలో ఆత్మవిశ్వాసంతో నవ్వే స్థైర్యం  కూడా అల్లంతో వస్తుంది.ఎందుకంటే నోట్లో పెరిగే బ్యాక్టీరియాను తగ్గించడానికి అల్లం ఉపయోగపడుతుంది.

గర్భిణీగా ఉన్న సమయంలో కడుపులో ఉన్న అసౌకర్యం దూరం అవుతుంది. ప్రేగులలో నిలిచిపోయిన గ్యాస్ నుంచి ఉపశమనం పొందడానికి అల్లం తినాలి. వాంతులు, వికారం కలిగినప్పుడు దీనిని తినిపించాలి. అల్లం తినడం వల్ల ఆస్తరైటీస్ నుంచి దూరంగా ఉండవచ్చు.శరీరం మీద ఉన్న వాపు దూరమవుతుంది.
అల్లంలో ముఖ్యంగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. అలానే అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్నాయి. అందువల్ల మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది.అల్లంలో యాంటీ బాక్టీరియాల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మన శరీరంలో గ్యాస్ట్రోఇంటస్ట్రైనల్ సమస్యలు ఉన్న కొంత మేరకు తగ్గిస్తుంది.అలానే మనకి రెస్పరేటరీట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.
అల్లంని ప్రతిరోజు తీసుకోవడం వలన మన జీర్ణశక్తి పెరుగుతుంది.అల్లాన్ని పచ్చిగా నమిలిన లేదా జ్యూస్ చేసుకొని అందులో కొంచెం తేనె వేసుకొని తాగడం వలన కూడా మన జీర్ణవ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుంది.ఉదయాన్నే అల్లంని టీ లో వేసుకొని త్రాగడం వల్ల జలుబు, దగ్గు గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.ప్రతిరోజు అల్లాన్ని  తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: