చలికాలంలో వచ్చే చుండ్రును తగ్గించుకోవాలంటే.. ఒక్క స్ఫూన్ ఆయిల్ చాలు..!

Divya
ఇప్పుడున్న జీవనవిధానం, పొల్యూషన్ జుట్టుకి సరైన సంరక్షణ లేకపోవటం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలను వాడటం వంటివాటి వల్ల జుట్టు సమస్యలు అధికమవుతున్నాయి.ముఖ్యంగా ఈ చలికాలంలో చుండ్రు, జుట్టు రాలడం, నిర్జీవంగా మారడం వంటి ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడుతుంటాయి.జుట్టు సమస్యలు తగ్గించుకోవడానికి ఎంతో ఖర్చు చేసి, రకరకాల ప్రోడక్ట్స్ వాడుతుంటారు.కానీ ఎలాంటి ఖర్చులేకుండా మన ఇంట్లోనే కొన్ని రకాల నూనెలు తయారుచేసుకొని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తక్కువ ఖర్చుతో జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ నూనెను తరుచూ వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, పొడువుగా దృఢంగా తయారవుతుంది.అది ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఒక కడాయి తీసుకొని అందులో రెండు లేదా మూడు తమలపాకులను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు రెబ్బలను ,రెండు స్పూన్ ల మెంతులు, ఒక స్పూన్ కలోంజి సీడ్స్ మరియు కోకనట్ ఆయిల్ వేయాలి. వీటన్నింటినీ వేసిన తర్వాత,ఈ పాన్ ను స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల, వాటిలో ఉన్న ఔషధ గుణాలు నూనెలోకి చేరతాయి.
ఇలా మరిగించిన నూనెను వడగట్టి వారానికి రెండు సార్లు జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరుకు రాసి మర్దన చేసుకోవాలి. రెండు గంటలు అలాగే ఉంచుకొని మైల్డ్ షాంపువేసి, గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టురాలడం, చుండ్రు వంటివి సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది.అంతే కాకుండా గ్రే హెయర్ ని నల్లగా మారుస్తుంది.ఈ నూనెను ఒకసారి తయారు చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.
ఇందులో వాడినా ప్రతి పదార్థంలోను ఉన్న పోషకాలు జుట్టును సంరక్షించడానికి ఉపయోగపడతాయి. కావున ఈ నూనెను ఉపయోగించి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి సులభంగా, తక్కువ ఖర్చుతో బయట పడవచ్చు. మెంతులను మన పూర్వికులు కూడా జుట్టు సంరక్షణలో వాడేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: