దగ్గు తీవ్రంగా బాధిస్తోందా.. అయితే ఈ పండు తినాల్సిందే..!!

Divya
సాధారణంగా కొంతమందికి దగ్గు ఒకటి రెండు రోజులు కాకుండా రోజుల తరబడి దీర్ఘకాలికంగా వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు కొన్ని రకాల పనులను తీసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా దానిమ్మ పండు దీర్ఘకాలిక దగ్గులను తగ్గిస్తుంది. దానిమ్మ రసంలో అల్లం రసం,తేనె కలుపుకొని తాగితే దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది దగ్గుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు దగ్గుతో పూర్తిస్థాయిలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ చిట్కా పాటించి సమస్య నుంచి బయటపడవచ్చు.
కొంతమందికి వేడి చేసినప్పుడు ముక్కులో నుంచి రక్తం వస్తుంది. ఈ సమస్య ఉన్నవారికి దానిమ్మ పువ్వులను దంచి రసం తీసి ఆ రసాన్ని కొంచెం  ముక్కులో వేస్తే ముక్కు నుంచి రక్తం కారే సమస్య నుంచి విముక్తి కలుగుతుంది .దానిమ్మ గింజలు కీళ్ళ వాతాన్ని మరియు ఆర్థరైటీస్  జబ్బును నయం చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఫ్లేవనాయిడ్స్.. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించడానికి పనిచేస్తాయి.

దానిమ్మ గింజలు డయాబెటిస్ వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ గింజలలో ఉండే కొన్ని రకాల యాసీడ్లు మధుమేహ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపరిచి, వదులుగా మారిన పళ్ళను గట్టి పరుస్తాయి. ఈ గింజలు నోటిలోని బ్యాక్టీరియాతో కూడా.. తమలోని సూక్ష్మజీవుల వ్యతిరేక లక్షణాల వలన పోరాడుతాయి. దానిమ్మ పండులో విటమిన్ సి ఉండడం వల్ల శరీరం లో ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్లిపోయి చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉంటుంది.
దానిమ్మ పండుతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని అడ్డుపడకుండా దానిమ్మ పండు లోని పోషకాలు నివారిస్తాయి చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. దానిమ్మ పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ చాలా వేగంగా మారుతుంది త్వరగా జీర్ణం అవుతుంది. దానిమ్మ పండు తినడం వల్ల అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: