ముల్లంగి తరుచు తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!

Divya
చాలామంది కొన్ని కూరగాయలను వాటి వల్ల కలిగే లాభాలు తెలియక పక్కన పెడుతుంటారు. అలాంటి వాటిల్లో ముల్లంగి ఒకటి. ఎందుకంటే దీని వాసన, రుచి అంతగా చాలా మందికి నచ్చదు కాబట్టి. ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కళంగా ఉన్నాయి.బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ముక్కు మూసుకొని అయినా తింటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చలికాలంలో సాధారణంగా వచ్చే దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పి వంటి వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ముల్లంగి లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా బాగా ఉపయోగపడతాయి.
1).జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది..
ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటూ... ఆకలిని పెంచి... మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు పుష్కళంగా ఉన్నాయి.చాలా మంది తిన్న ఆహారం జీర్ణం కాక ఇబ్బందిపడుతుంటారు.అలాంటివారు భోజనం చేసిన తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాక ఇలా తింటే మలబద్ధకం, అర్ష మొలలు, ప్లీహం, కామెర్ల వంటి సమస్యలు దరి చేరవు.
2).నపూంసకత్వాన్ని తగ్గిస్తుంది..
కొంతమంది అబ్బాయిలు నపుంసకత్వం ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ముల్లంగి గింజల్ని, ఆవు పాలలో వేసి మరిగించి రోజూ రెండు పూటలా తీసుకోవడం వల్ల, లైంగిక శక్తి పెరగడమే కాక,శీఘ్రస్కలన సమస్య కూడా తగ్గుతుంది.
కిడ్నీల్లో రాళ్ల తో బాధపడేవారు రోజూ ఉదయాన్నే అరకప్పు ముల్లంగి ఆకుల రసం తాగితే రాళ్లు క్రమంగా కరిగిపోతాయి. ముల్లంగిని తరుచు తీసుకోవడం వల్ల అధిక బరువు ఉన్నవారికి,మధుమేహంతో బాధపడేవారికి మంచి ఫలితం కలుగుతుంది.ముల్లంగి గింజల్ని రాత్రంతా నానబెట్టి, బాగా నూరి,ఆ మిశ్రమాన్ని శరీరంపై మొటిమలు, మచ్చలు,గజ్జి, పొక్కులు ఉన్న చోట రాస్తే క్రమంగా తగ్గుతాయి.
ముల్లంగిలో ఆంథోసైనిన్ ఉండటం వల్ల రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది.దీని వల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు.ఒకటి రెండు సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చినవారు తరుచూ ముల్లంగి గింజల మిశ్రమం పాలలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: