ఆహారం త్రాగండి.. నీళ్లు నమలండి..!

Divya

 ఆహారం త్రాగండి, నీళ్లు నమలండి అని టైటిల్  తప్పుగా పెట్టానని అనుకున్నారేమో కాని అది కరెక్టే. ఆరోగ్యంగా ఉండాలంటే మన పూర్వికులు నుండి ఇప్పటి శాస్త్రవేత్తల వరకు చెప్తున్న ఫార్ములా అదే.ఈ కాలం లో ఏ అనారోగ్యం లేకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉండడం కంటే మించిన అదృష్టం లేదు.అలాంటిది మన శరీరంలో ఎక్కువగా ఆరోగ్యం మీద ప్రభావం చూపించే భాగం ఏదైనా ఉందంటే అది మన జీర్ణ వ్యవస్థనే.
మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చి మనకి శక్తిని ఇచ్చేది మన  జీర్ణవ్యవస్థనే. మన ఆరోగ్యం బాగుండా లంటే  జీర్ణవ్యవస్థని చక్కగా కాపాడుకోవాలి.మన జీర్ణవ్యవస్థ మన కడుపులో నుండి కాదు, మన నోటి నుండే మొదలవుతుంది. కానీ చాలా మంది నోటిని సరిగా ఉపయోగించడం లేదు. అన్నం నోటిలో పెట్టుకొని  నమలకుండా అలానే మింగేస్తున్నారు.అందుకే మన పెద్దలు ఆహారాన్ని కనీసం 32సార్లు నమలమని చెప్తారు.అంటే ప్రతి ముద్ద నోట్లో పెట్టుకొని 32సార్లు నమలమని కాదు.నోట్లో ఆహారం నీళ్లులా మారే వరకు నమిలి అప్పుడు మింగాలి.అదే ఆహారం త్రాగడం అంటే.

మన నోట్లో ఉండే లాలాజలంకి చాలా పవర్  ఉంటుంది.
మన శరీరంలో ఉండే కొన్ని జబ్బులకి  ఈ లాలాజలం ఒక మెడిసిన్ లాగ పని చేస్తుంది.అంతేకాదు  ఈ లాలాజలం పెయిన్ కిల్లర్ లాగ కూడ పనిచేస్తుంది.మన అందరికి తెలిసిన పెయిన్ కిల్లర్  మార్ఫిన్ కంటే కూడ లాలాజలం ఆరు రెట్లు పనిచేస్తుందని ఒక స్టడీలో  తేలింది. ఆహారాన్ని నోట్లో పెట్టుకొని బాగా నమిలినప్పుడు  ఆ లాలాజలంతో కలిసినప్పుడు మన మెదడుకి ఒక సమాచారం.. మన బ్రెయిన్ కి సిగ్నల్ గా వెళ్తుంది.అప్పుడు మన ఆహారాన్ని అరిగించడానికి అవసరమయ్యే ఆసిడ్స్ ను  విడుదల చేస్తుంది.ఈ లోపు ఆహారాన్ని బాగా నమలడం వల్ల నోట్లోనే సగం జీర్ణమవుతుంది. కాబట్టి మన జీర్ణవ్యవస్థ కి కొంచెం పని తగ్గుతుంది.ఇలా ఆహారం బాగా అరిగినప్పుడు పేగులు వాటి పోషకాలను బాగా తీసుకుంటాయి. ఒకవేళ సరిగ్గా నమ్మలకుండా మింగేస్తే ఆ భారం జీర్ణాశయం మీద పడి సరిగ్గా జీర్ణం కాదు మరెన్నో సమస్యలు వచ్చాయి అవకాశం ఉంది కాబట్టి ఆహారం పూర్తిగా నమిలిన తర్వాతనే మింగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: