దానిమ్మ తొక్కేవల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు..!!

Divya
సాధారణంగా దానిమ్మ గింజలు ఆరోగ్యానికి మంచిదని వాటిని మాత్రమే తిని,తొక్కను పడేస్తుంటాము. కానీ తొక్కల్లో కూడా అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.
ఆయుర్వేద చికిత్సలో దానిమ్మ గింజలతో పాటు, తొక్కలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎర్రటి దానిమ్మ తొక్కల్లో వాటి గింజల కంటే 50 శాతం  యాంటీఆక్సిడెంట్లను కలిగివుంటుంది. దానిమ్మ గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో  ఉంటుంది.రక్తంలో గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దానిమ్మ తొక్కల వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1).జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది..
దానిమ్మ తొక్కలు జుట్టు సమస్యలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం దానిమ్మ తొక్కలను తీసుకొని నీడలో ఎండబెట్టి,పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని కొబ్బరినూనెతో కలపి,జుట్టు కుదుళ్ల నుంచి చివర వరకు బాగా అప్లై చేసి  మసాజ్ చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
2).సీజనల్ రోగాలు తగ్గించడానికి..
 సాధారణంగా చలికాలంలో గొంతు నొప్పి, జలుబు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిని నివారించడానికి ఒక టీ స్ఫూన్ దానిమ్మతొక్కల పొడిని, గోరువెచ్చని నీటితో కలిపి ఆ నీటితో గొంతును గరగరలాడించాలి.ఇందులో ఉండే హైడ్రోఆల్కహాలిక్ సారం, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల సీజనల్ వచ్చే అనారోగ్యలను తగ్గిస్తుంది.
3). వృద్ద్యాప్య ఛాయలను తగ్గిస్తుంది..
దానిమ్మ తొక్కలలోని ఔషదగుణాలు చర్మంలోని కొల్లాజెన్ ను మెరుగుపరుస్తాయి.ఇది వృద్ధాప్య ఛాయలు, ముడతలను ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది.ముఖముపై వచ్చే ఇతర సమస్యలకు కారణమైన బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్‌లను నశింపజేస్తాయి.
4).గుండెజబ్బులను నివారిస్తుంది..
దానిమ్మ తొక్కలు పొడిని మొతాదులో తీసుకుంటే గుండె జబ్బులకు దారితీసే ప్రమాద కారకాలను నియంత్రిస్తాయి. అంతేకాక చెడుకొలెస్ట్రాల్ ని కరిగించి అధిక బరువు, ఊబకాయంను నిరోదిస్తుంది.రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ ని క్రమబద్దీకరించి, షుగర్ తగ్గించడంలో సహాయపడుతుంది. కావున దానిమ్మ తొక్కలు పడేయకుండా పొడిచేసి వాడుకుంటే, ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: