జుట్టు ఉడిపోతోందని బాధపడుతున్నారా..అయితే పెసరపప్పు ప్యాక్ వేయాల్సిందే ..!!

Divya
మన దేశంలో పూర్వకాలం నుంచి పెస‌ల‌ను వంటకాల్లో అధికంగా వినియోగిస్తున్నారు.పెసలు రుచిగా ఉండడమే కాక శరీరానికి కావాల్సిన ఎన్నో పోషక విలువలను పుష్కళంగా అందిస్తుంది.కావున వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుతాయి. ఇవి శరీర ఆరోగ్యానికే కాక జుట్టు ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. చాలామందికి జుట్టు అనేక కారణాల వల్ల ఉడుతుంటుంది.పొల్యూషన్, ఒత్తిడి వంటివి కారణాలు కావొచ్చు. విటన్నింటికి పెసరపప్పు ప్యాక్ తో చెక్ పెట్టొచ్చు.ఆ ప్యాక్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ముఖ్యంగా జుట్టు ఉడకుండా అడ్డుకట్ట వేసే ప్రోటీన్లు  పెసరపప్పులో అధికంగా ఉన్నాయి. దీనితో జుట్టుకు ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.దీని కోసం ఒక గిన్నె తీసుకుని అందులో గుప్పెడు పెసలు తీసుకోవాలి.మరియు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి నీటితో బాగా శుభ్రం చేసి, ఒక గ్లాస్ నీరు పోసి రాత్రి అంతా నానబెట్టాలి.మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ గిన్నె తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసలు, మెంతులు వేయాలి.అలాగే రెండు లేదా మూడు మందారం పూలు మరియు మందారం ఆకులు వేసి మెత్తగా మీక్సీ పట్టుకోవాలి.ఈ మిశ్రమాన్ని బాగా వడకట్టి, అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, కలబంద గుజ్జు వేసుకొని బాగా కలపాలి.
ఆ తర్వాత దీనిని మాడు నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించి, మసాజ్ చేసి ఒక మెత్తని గుడ్డతో కట్టి ఉంచాలి. ఇలా అప్లై చేసినా తర్వాత రెండు గంటల సేపు అలానే ఉంచి అనంతరం మైల్డ్ షాంపూ ఉపయోగించి,గోరువెచ్చని నీటితో తలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు కుదుళ్ళు గట్టిపడి జుట్టు ఊడటం తగ్గిపోతుంది.
ఈ ప్యాక్ ఫలితంగా జుట్టు ఒత్తుగా మరియు దృఢంగా తయారవుతుంది.జుట్టుకు ప్యాక్ లు పై పుతగా సంరక్షిస్తే, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం, పొల్యూషన్ నుండి కాపాడుకోవడం, ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించుకోవడం వంటివి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: