ముల్లంగి: ఆరోగ్యానికి చాలా మంచిది?

Purushottham Vinay
ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉన్నందున, ఇది జలుబు ఇంకా దగ్గు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే మీ ప్రాథమిక రోగనిరోధక వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ ఇంకా వాపు సమస్యలను కూడా ఈజీగా అడ్డుకుంటుంది. ఈ ముల్లంగి కొల్లాజెన్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక ఇది మన రక్త నాళాలను కూడా పెంచుతుంది. అలాగే ఆర్టిరియోస్క్లెరోసిస్ వచ్చే అవకాశాలను కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే ఆమ్లత్వం, ఊబకాయం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంకా అలాగే వికారం మొదలైన వాటిని నయం చేయడంలో ముల్లంగి సహాయపడుతుంది. ఇక ఎర్ర ముల్లంగిలో విటమిన్ ఇ, ఎ, సి, బి6 , కె, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, జింక్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, ఐరన్ ఇంకా అలాగే మాంగనీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.ప్రతి రోజూ కూడా ముల్లంగి రసం తాగితే చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.అలాగే ఈ ముల్లంగిని రోజువారీ సలాడ్ లో తీసుకుంటే మంచిది. దీన్ని తింటే మంచి ఫైబర్‌లను అందిస్తుంది. అందువల్ల మీ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది.ఇంకా అలాగే శరీరానికి కావాల్సిన నీటి స్థాయిలను కూడా అందిస్తుంది. ఈ ముల్లంగి ఆంథోసైనిన్‌లకు మంచి మూలం.


ఇక ఇది మన గుండెను సక్రమంగా పని చేసేలా చేస్తుంది. ఇంకా అలాగే సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వీటిలో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఇంకా ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఈ ముల్లంగి మీ శరీరానికి పొటాషియంను కూడా అందిస్తుంది, ఇది మీ రక్తపోటును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే రక్త ప్రవాహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. ఇక ఈ ముల్లంగి రక్తంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపుతుంది.ఇక ఈ ముల్లంగి మన కాలేయంతో పాటు కుడుపును శుభ్రపరిచి నిర్విషీకరణకు సహాయపడుతుంది. నల్ల ముల్లంగి ఇంకా అలాగే దాని ఆకులను కామెర్లు చికిత్సకు చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది అదనపు బిలిరుబిన్‌ను కూడా తొలగిస్తుంది. ఇది మన రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందులోని సల్ఫర్ కంటెంట్ హైపోథైరాయిడిజమ్‌ను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా ముల్లంగి మన ఎర్ర రక్త కణాల నష్టాన్ని కూడా నియంత్రిస్తుంది.ఇంకా అలాగే రక్తానికి ఆక్సిజన్ సరఫరాను కూడా పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: