విరివిగా లభించే ఈ టమోటా జ్యూస్ తో ఎన్ని ఉపయోగాలో..?

Divya
టమోటా వలన మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. టమోటాని మనం నిత్యం ఏదో ఒక వంటలో వాడుతూనే ఉంటాం. అలానే మనం రోజు వాడుకునే కూరగాయలలో టమోటా ప్రథమ స్థానంలో ఉంటుంది. ప్రతి వంటకంలోనూ టమోటాలు వాడుతారు.వాటి వలన ఆ కూరకు చక్కని రుచి వస్తుంది. అయితే ఆ టమోటాలను కూర రూపంలో కాకుండా నిత్యం జ్యూస్ రూపం లో త్రాగితే లాభాలు పెరుగుతాయి. నిత్యం పడగడుపున టమోటా జ్యూస్ తాగడం వలన పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇంకా ఇతర లాభాలు కూడా పెరుగుతాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1). టమోటా జ్యూస్ యొక్క లాభాలు :
యాంటీ ఆక్సిడెంట్లు: టమాటాల్లో బీటా కెరటిన్, లైకోపీన్ అనబడే పవర్ ఫుల్  యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి  వలన టమోటాలు ఎరుపు రంగులో ఉంటాయి.  ఈ క్రమంలో రోజు టమోటా జ్యూస్ త్రాగడం వలన  గుండె  సమస్యలు రాకుండా ఉంటాయి.
టమోటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో నూట్రియంట్లు మన శరీరంలో ఉండే ఖనిజాలు నశించ  కుండా చూస్తాయి.
జీర్ణసమస్యలు : తరచూ జీర్ణ సమస్యలతో  బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాస్ టమోటా జ్యూస్ త్రాగడం వలన ఫలితం ఉంటుంది.  దీంతో మలబద్ధకం పోయి విరేచనం సాఫీగా జరుగుతుంది. అలాగే తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. టమోటాల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.
ఈ టమోటా జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి  శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు టమోటా రసాన్ని తాగడం వలన మధుమేహాన్ని అదుపులో ఉంచుకొనవచ్చు .
టమోటాల్లో ఉండే బీటా కెరటిన్, విటమిన్ వల్ల కొవ్వు అదుపులో ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. టమోటా జ్యూస్ ప్రతి రోజు తాగడం వలన బరువు తగ్గడంతో పాటు రక్త హీనత సమస్యను కూడా సులభంగా  తగ్గించుకోవచ్చు.
టమోటా రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది. అలానే కంటి చూపును మెరుగుపరుస్తుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవచ్చు.
టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్, లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి మెరుగుపరచడంలో సహాయపడతాయి.
టమోటా రసం శరీరం నుండి విష పదార్థాలు తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే దీన్ని రోజు తెలుసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: