ఇలా నీరు తాగితే ప్రమాదమే? ఎలా తాగాలి?

Purushottham Vinay
మీరు నీరు తాగే విధానం ఆరోగ్యంపై  ప్రభావం చూపుతుంది. చాలా మంది కూడా నుంచొని తాగుతారు.అయితే అలా నీరు నిల్చుని తాగినప్పుడు దాని వేగం కారణంగా అజీర్తి ఇంకా కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ఇది ఆర్థరైటిస్‌ సమస్యను కూడా పెంచుతుంది. నీరు తాగే సమయంలో ప్రవాహ వేగం కనుక ఎక్కువగా ఉంటే.. అది ఊపిరితిత్తులకు కూడా ప్రమాదం తలపెడుతుంది.నీటిని ముందు సరిగా కూర్చోని అలాగే వీపును నిటారుగా ఉంచి.. ఆ తరువాత నీరుని తాగాలి. ఇలా తాగడం ద్వారా నీరు మెదడుకు కూడా అందుతుంది. అందువల్ల మెదడు కార్యకలాపాలు మెరుగవుతాయి. అలాగే జీర్ణక్రియలో ఇది సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఇంకా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇక అంతేకాదు.. కండరాలు, నాడీ వ్యవస్థ కూడా బాగా రిలాక్స్ అవుతాయి. మూత్రపిండాలపై అస్సలు ఒత్తిడిని కలిగించదు. ఇవి చాలా సులభంగా వడపోత పక్రియను చేయగలుగుతాయి.ఎప్పుడూ కూడా ఒకేసారి ఎక్కవ నీటిని తాగొద్దు. కొంచెం కొంచెం  తాగాలి.


ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా నీరు తాగడం వల్ల శ్వాసనాళంలోకి  చేరి బాగా ఇబ్బంది పడే ప్రమాదం గురి చేస్తుంది.అలాగే ఇది ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా అవ్వొచ్చు. అందుకే ఎప్పుడూ కూడా కొంచెం కొంచెం నీటిని తాగాలి. ఎందుకంటే ఇలా తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.వేసవి కాలం అయినా చల్లని నీరు అస్సలు తాగొద్దు. చన్నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ అనేది నెమ్మదిస్తుంది.శరీరంలోని వివిధ అవయవాలకు రక్త సరఫరాకు అంతరాయం కూడా కలుగుతుంది. చల్లని నీరు తాగడం వల్ల చాలా ఈజీగా మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది.అందుకే గది ఉష్ణోగ్రత వద్ద నీటిని తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక శరీరానికి నీరు అవసరం అయితే వెంటనే మనకు  తెలుస్తుంది. అందుకే కేవలం దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తాగాలి. అంతకు మించి తాగడం వల్ల అసలు ఎలాంటి ఉపయోగం లేదు. పైగా మీకు కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: