పరగడుపున ఉసిరి ఈ విధంగా తీసుకుంటే ఎన్నో లాభాలు?

Purushottham Vinay
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎప్పుడు పోషక విలువలున్న ఆహారాన్ని తినడం తప్పనిసరి. ఈ పోషక విలువలు మాంసం, పండ్లు ఇంకా కూరగాయలలో ఎక్కువగా ఉంటాయి. ఇంకా అలాగే తెనే, ఉసిరిలో కూడా సరపడినంతగా పోషక విలువలు ఉంటాయి.ఉసిరి, తేనెలలో యాంటీ బాక్టీరియల్‌ ఇంకా అలాగే యాంటీ ఫంగల్ వంటి గుణాలతోపాటు శరీర వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టం చేసే చాలా గుణాలు సమృద్దిగా ఉన్నాయి. ఇక ఈ రెండింటిని కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. తేనెలో నానబెట్టిన ఉసిరికాయను ప్రతి రోజూ ఉదయం పూట పరగడపున తీసుకోవడం వల్ల లివర్‌ హెల్తీగా ఉండడమే కాక శరీరానికి జాండిస్‌ రాకుండా కూడా నివారిస్తుంది.ఇంకా అలాగే శరీరంలో భాగాలలో, ముఖ్యంగా కాలేయంలో చేరిన బైల్ పిగ్మెంట్ ఇంకా టాక్సిన్స్‌ను ఇవి తొలగిస్తాయి. దాంతో కాలేయం కూడా మరింత చురుకుగా పనిచేయగలుగుతుంది.ఇంకా అంతేకాక తేనెలో నానబెట్టిన ఉసిరికాయ అజీర్తి, ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడుగా పని చేస్తుంది. ఇది ఆకలిని పెంచడంతో పాటు జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది. తేనెలో ఊరిన ఉసిరికాయ ద్రవాన్ని త్రాగడం వల్ల మలబద్దకం ఇంకా పైల్స్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.


ముఖ్యంగా చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు ఇంకా గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు ఈజీగా నయమవుతాయి. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వు కూడా ఈజీగా కరిగిపోతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారికి ఈ తెనే ఉసిరి వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. తేనెలో నానిన ఉసిరిని ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మంపై ముడతలు తగ్గి మీరు చాలా యవ్వనంగా కనపడతారు.ఇక ఇందుకోసం ఒక జార్ తీసుకుని అందులో సగం దాకా తేనెను పోసి దానిలో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. ఆ తర్వాత మూత బిగించి దానిని పక్కకు పెట్టాలి. తరువాత కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. ఆ తరువాత వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి పొద్దున్నే పరగడుపున తీసుకోవాలి. ప్రస్తుతం ఉసిరికాయలు చాలా బాగా లభిస్తున్నాయి. కాబట్టి తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను వెంటనే తిని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: