దాల్చినచెక్క పొడి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..వదలరు..!!

Divya
దాల్చినచెక్క మసాలా వంటల్లో తప్ప ఎక్కడ వాడరు. కానీ దానిని టీ లేదా జ్యూస్ వంటి పానీయాల్లో కలిపి త్రాగటం వల్ల, చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.దాల్చిన చెక్క.. సువాసనతోపాటు మంచి రుచిని కూడా అందింస్తుంది.చాలామంది దాని వాసన నచ్చి, దానిని పచ్చిగానే తింటువుంటారు.అలాంటి దాల్చిన చెక్క వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దామా..
రోజూ ఉదయాన్నే టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, వేడి నీటిలో కలుపుకొని త్రాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ఆహారనిపుణులు సూచిస్తుంటారు. దాల్చిన చెక్కలో శరీరానికి కావాల్సిన పైబర్ , కాల్షియం, ఐరన్ తదితర న్యూట్రియాంట్స్ పుష్కళంగా ఉంటాయి.
దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు:
తగిన మొతాదులో దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో చక్కర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. పేగు సమస్యలను నివారిస్తుంది.
దాల్చిన చెక్క పొడి రక్తం చిక్కబడకుండా కాపాడుతుంది.
❂ శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి,గుండె సమస్యలను తగ్గిస్తుంది. దీనిని తరుచు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గించడములోనూ సహాయం చేస్తుంది.శరీరంలోని నీరసంను తగ్గించి రోజంకంత సరిపడా శక్తిని ఇస్తుంది.దీని కషాయం త్రాగటం వల్ల
క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
 దాల్చిన చెక్కను తేనెలో కలుపుకొని తీసుకోవడం వల్ల ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి,గుండెజబ్బులను అరికడుతుంది. దాల్చిన చెక్క పొడి ఉదయాన్నే తాగే కాఫీ లేదా టీలోనైనా పళ్ల రసాల్లో నైనా దాల్చిన చెక్క పొడిని కలుపుకుని త్రాగటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఎవరు తీసుకోకూడదు..!
 దాల్చిన చెక్క పొడిని చర్మం దురద మంటగా ఉన్నా, అలర్జీలు ఏర్పడినా.. తీసుకోకూడదు.గర్భిణీలు, ఆరేళ్ల లోపు పిల్లలు దాల్చిన చెక్కవున్న ఆహారం తీసుకోకూడదు. పేగు సమస్యలు, కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారు దాల్చిన చెక్కకు దూరంగా ఉండాలి.హార్మోనల్ సమస్యలు కలవారు రోజూ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: