షుగర్ పేషెంట్స్ ఏ పాలు తాగితే మంచిది?

Purushottham Vinay
షుగర్ వ్యాధి ఈరోజుల్లో చాలా మందిని కూడా బాగా పట్టి పీడిస్తుంది. చాలా మంది కూడా ఈ వ్యాధి వల్ల మరణిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వస్తే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.ఆరోగ్య నిపుణుల సూచిస్తున్న నియమాల ప్రకారం.. పాలు సంపూర్ణ ఆహారం. ఈ పాలను అల్పాహారంగా  తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులకు ప్రయోజనం ఉంటుంది.పాలు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను కూడా బాగా నెమ్మదిస్తుంది.ఇంకా అలాగే రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.ఉదయాన్నే పాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మూడు పద్దతుల ద్వారా పాలు తీసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీరు కనుక డయాబెటిక్ పేషెంట్ అయితే ఖచ్చితంగా బాదం పాలు తాగడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బాదం పాలు కూడా మార్కెట్లో సులువుగా దొరుకుతాయి. లేదంటే చాలా ఈజీగా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బాదం పాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 


అలాగే ఇందులో విటమిన్లు D, E, అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇంకా అలాగే ప్రోటీన్, ఫైబర్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది.అలాగే దాల్చిన చెక్క పాలు చక్కెర రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే దాల్చినచెక్క రక్తంలో చక్కెరను నియంత్రించడానికి పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలు, దాల్చినచెక్క మిశ్రమంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఇంకా మధుమేహ వ్యాధిగ్రస్తులకు పసుపు పాలు చాలా రకాలుగా మేలు చేస్తాయి.ఎందుకంటే ఈ పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని చాలా ఈజీగా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: