కలబంద: సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి?

Purushottham Vinay
అనారోగ్య సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ అవుతాయి. ఇంకా అంతేకాకుండా కలబందలో ఉండే లాక్సైటివ్ గుణాలు మనం తీసుకున్న మందులను శరీరం గ్రహించకుండా చేస్తుంది. ఇంకా అలాగే కొంతమందిలో కలబంద రసం అలర్జీకి కూడా కారణమవుతుంది. కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల కొంతమందిలో చర్మం పై చదద్దుర్లు, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. కలబంద వల్ల అలర్జీకి గురి అవుతామో లేదో తెలుసుకోవాలంటే రెండు లేదా మూడు చుక్కల కలబంద రసాన్ని చర్మానికి రాయాలి. చర్మం పై సమస్యలు తలెత్తితే కలబంద వల్ల మనం అలర్జీ బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందని భావించాలి.


గర్భిణీలు కలబంద రసానికి ఖచ్చితంగా వీలైనంత దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా పాలిచ్చే తల్లులు కూడా దీనిని అస్సలు తీసుకోకూడదు. ఇంకా అలాగే 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి కూడా ఈ కలబంద రసాన్ని అస్సలు ఇవ్వకూడదు. కలబంద రసాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కలబంద రసాన్ని తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలను చాలా ఎక్కువ చేసే ఎడ్రినలిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది.ఇంకా అంతేకాకుండా శరీరంలో పొటాషియం స్థాయిలను తగ్గించి క్రమరహిత హృదయ స్పందనలను కూడా కలిగిస్తుంది. కలబందను వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.షుగర్ కి మందులు వాడే వారు, ఇన్సులిన్ ఇంజెక్షన్ లు తీసుకునే వారు ఈ కలబంద రసానికి దూరంగా ఉండడం చాలా మంచిది. దీర్ఘకాలం పాటు కలబందను వాడటం వల్ల మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. అధిక మొత్తంలో ఈ కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల పెల్విస్ ఇంకా మూత్రపిండ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ కలబంద రసాన్ని తగిన మోతాదులో వైద్యులు సూచించిన ప్రకారం తీసుకోవడం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: