సీమ చింతకాయ ఎంత మేలు చేస్తుందంటే?

Purushottham Vinay
సీమ చింతకాయలు పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి ఇంకా అలాగే నోటి పూతలని నిర్వహించడానికి సహాపడతాయి. ఇంకా అలాగే యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తాయి. ఈ చింతపండులో విటమిన్ సి అనేది బాగా పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి కఫాన్ని ఈజీగా తగ్గిస్తుంది.సీమ చింతకాయ జిడ్డుగల మాడుకు ఖచ్చితంగా మంచి చికిత్స చేస్తుంది. జుట్టు రాలడాన్ని చాలా ఈజీగా నివారిస్తుంది. ఇంకా అలాగే వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తుంది. మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నల్లటి మచ్చలను ఈజీగా తొలగిస్తుంది. మొటిమలను కూడా ఈజీగా తగ్గిస్తుంది.అలాగే డయేరియా సమస్యతో బాధపడే వాళ్లకు కూడా సీమ చింతకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. సీమ చింతకాయ లో ఉండే గుణాలు డయేరియా సమస్యను ఈజీగా తగ్గిస్తాయి. దీనికోసం మీరు సీమ చింతకాయ కొమ్మను తీసుకుని దానిని మరిగించి ఆ నీళ్ళని తీసుకోండి. దీంతో డయేరియా సమస్య ఈజీగా తగ్గిపోతుంది.ఈ సీమ చింతకాయలను తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్‌ ఇంకా అలాగే ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి.


 జ్ఞాపకశక్తి, మానసిక స్థితి ఇంకా ఏకాగ్రతను కూడా పెంచుతుంది. మధుమేహం వ్యాధి గ్రస్తులు ప్రతి రోజు తగిన మోతాదులో సీమ చింతకాయలు తీసుకుంటే రక్తంలో చెక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. అతి ఆకలి కూడా తగ్గు ముఖం పడుతుంది. దాంతో ఈజీగా బరువు తగ్గుతారు.ఇంకా అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలో సీమ చింతకాయలు చాలా అద్భుతంగా సహాయపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. గులాబీ, ఎరుపు ఇంకా అలాగే తెలుపు రంగుల్లో ఉండే ఈ సీమ చింతకాయలు కాస్త తియ్యగా ఇంకా కాస్త వగరు గా ఉంటాయి. కానీ, వీటిలో పోషకాలు చాలా మెండుగా ఉంటాయంటున్నారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ప్రోటీన్స్‌, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలతో నిండి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: