లైఫ్ స్టైల్: గర్భిణీ స్త్రీలారా రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారా..అయితే వీటిని తినండి..!!

Divya
 ఈ మధ్యకాలంలో ప్రతి గర్భిణీ స్త్రీ ఎదుర్కొనే ముఖ్యమైన రక్తహీనత. పూర్వం మన పెద్దలు ఎంతో మంచి న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ ని తినేవారు కాబట్టి కావాలి వారు గర్భం దాల్చిన సరే రక్తహీనత వారిదరి చేరేది కాదు. మనకున్న ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల ప్రతి గర్భిణీ స్త్రీ రక్తహీనత బాధపడుతూ  ఉంటుంది. అలాంటి వారికి మన ప్రకృతిలో బాగా దొరికే మునగాకు చాలా మేలు చేస్తుంది. అయితే ఆ మునగాకును  ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
ఒక కప్పు మునగాకు తీసుకొని మిక్సీ పట్టి రసం తీయాలి. ఆ రసము బాగా వేడిచేసి చల్లార్చి అందులోనే పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము దాల్చిన మొదటి రోజు  నుండే తీసుకోవడం వల్ల కడుపులో వున్న పిండము బాగా అభివృద్ధి చెందడమే కాక ప్రసవం సజావుగా జరుగుతుంది. ఇ మధ్య చాలా మందికి సిజేరియన్ చేసి బిడ్డను తీస్తున్నారు.ఎలాంటి ఆపరేషన్ లేకుండే సుఖప్రసావం జరిగేలా మునగాకు ఉపయోగపడుతుంది.ఇందులో ఉన్న క్యాల్షియం , ఐరన్ , విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది.

కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారు స్త్రీ అధిక బ్లీడింగ్ వల్ల రక్తహీనత సమస్య ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు కూడా మునగాకు రసం కు తేనే, నిమ్మరసం కలిపి రోజు తీసుకోవడం వల్ల వారికి రక్తహీనత తగ్గడమే కాకుండా, అధికంగా అయ్యే బ్లీడింగ్ కూడా తగ్గుతుంది.ఇంకా కొంతమంది పురుషలు నాపూంసాకత్వం తో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు మునగపూలలో కొద్దిగా దాల్చినచెక్క పొడి అర టిస్పున్ కలిపిమిశ్రమం లా చేసి దానికి పాలతో కలిపి తాగడం వల్ల మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చిన సమృద్దిగా పాలు ఉత్పత్తి అగును. డెలివరీ తొందరగా రికవరీ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: