లైఫ్ స్టైల్: అవకాడో ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా వదలరు..!

Divya
 ఇప్పుడున్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకు కావలసినంత శక్తి ఇవ్వడానికి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లలో అధిక శక్తినిచ్చే, మరియు అధిక  ఆరోగ్యానికి ప్రయోజనాలు కలిగించే  వాటిలో అవకాడో ఒకటి అని చెప్పవచ్చు. మన శరీరాన్ని కావలసిన అన్ని న్యూట్రియన్స్ అవకాడలో పుష్కలంగా దొరుకుతాయి. అయితే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఈ పండులో పొటాషియం, ల్యూటేన్, మరియు ఫోలేట్ వంటి వాటితో 1పాటు దాదాపు 20 రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా బి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.ఇందులో  ప్రోటీన్ మంచికొవ్వులు,కార్బోహైడ్రేట్స్,పైబర్స్,కాల్షియం,
ఐరన్,మెగ్నీషియం, పొటాషియం,సోడియం, జింక్,విటమిన్ C,థియామిన్, రైబోఫ్లేవిన్,నియాసిన్,విటమిన్ B6,ఫోలేట్,విటమిన్ ఎ, ఇ, కె పుష్కళంగా లభిస్తాయి.

1).సంతానోత్పత్తిని పెంచుతుంది:
అవకాడోలలో అధిక మొత్తం లో ఫోలేట్ ఉంటుంది. ఇది గర్భస్రావం మరియు నాడీ లోపాల ప్రమాదాలను తగ్గించడానికి ముఖ్యమైన మూలకం. ఇది అంతే కాక పిల్లల ఎదుగుదల లోపాలున్న సరిచేస్తుంది. అవకాడో పిల్లలకి గుజ్జుల చేసిపెట్టడం నెలల బిడ్డ నుంచి మొదలు పెట్టొచ్చు.
2).మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది :
అవకాడోలు మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి.అధికంగా మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు కలిగిన ఆహారాలు డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక రవంటి వాటిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.
3).ఆస్టియో ఆర్థరైటిస్ను నివారిస్తుంది :
అవకాడోలోని నూనెలు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాపోనిన్లు అవశేషాలు, అవకాడో మరియు ఇతర వృక్ష సంబంధ ఆహార పదార్ధాలలో ఉన్నాయని కొన్ని పరిశోదనాలతో నిరూపించబడినది.ఇవి మోకాళ్ళ మీద ప్రభావం చూపే, ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాల బారినుంచి కాపాడుతాయి.


4).వృద్దాప్య లక్షణాలను తగ్గిస్తుంది :
 అవకాడో లో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ చర్మాన్ని లోపలి నుండి రిపేర్ చేస్తూ, ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ముడుతలు,మచ్చలను కూడా నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.మన శరీరాన్ని కావలసిన అన్ని పుష్కలంగా దొరుకుతాయి 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: