కాలేయం ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఇవి తినాల్సిందే?

Purushottham Vinay
మన బాడీలో కాలేయం చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాలేయానికి ఏదైనా సమస్య వస్తే ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుంది. ముఖ్యంగా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అందుకు సంబంధించిన పోషకాహారాలను తీసుకోవాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉన్న కార్బోహైడ్రేట్లను విచ్చిన్నం చేయడానికి, గ్లూకోస్ తయారుచేయడానికి కాలేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా కాలేయం పోషకాలను నిల్వచేసుకొని పిత్తాన్ని కలిగిస్తుంది. కాలేయం ఆరోగ్యవంతంగా పనిచేసినప్పుడే మనం తీసుకునే ఆహార పదార్థాలను సరైన క్రమంలో జీర్ణం చేసి అందులో ఉన్న పోషకాలను రక్తంలోకి ప్రవహించేలా చేస్తుంది. మన శరీరంలో ఉండే కాలేయం సరైన క్రమంలో పనిచేయకపోతే ఎన్నో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండాలని మనం తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. కాలేయం సరిగ్గా పని చేయకపోతే పనిచేయకపోతే జీర్ణక్రియ సమస్యలతో పాటు టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. అధిక మొత్తంలో కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తినడం కాలేయానికి మంచిది కాదు. ఒక అధ్యయనం ప్రకారం మన ఆహార పదార్థాలలో భాగంగా ఆలివ్ ఆయిల్ తీసుకోవటంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి కాలేయ పనితీరు మెరుగు పడుతుందని నిపుణులు తెలియజేశారు.


నూనెలలో అధిక మొత్తంలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటమే దీనికి కారణమని చెప్పవచ్చు.సాధారణంగా గింజలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీరంలో ఏర్పడే మంటను తొలగించడంతో పాటు, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో వాల్నట్, బాదం వంటి కొన్ని గింజలను తినడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే గింజలు అధికభాగం కేలరీలను కలిగి ఉండటం వల్ల ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అధికంగా శరీర బరువు పెరుగుతారు.బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ వంటి వివిధ రకాల బెర్రీ లలో అధిక భాగం పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి ఇవి కాలేయానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజు ఈ బెర్రీస్ తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో అధికభాగం యాంటీ ఆక్సిడెంట్లు వంటి గుణాలు ఉండటం వల్ల ఇవి కాలేయ ఆరోగ్యాన్ని ఉంచడంలో దోహదపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: