లైఫ్ స్టైల్: నానబెట్టిన బాదం వల్ల ఇన్ని లాభాలా..!!

Divya
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు తమ వయసు పెరిగే కొద్దీ వారిలో జ్ఞాపకశక్తి తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే కచ్చితంగా ప్రతిరోజు మనం ఉదయం లేవగానే బాదం పప్పు తింటూ ఉండాలని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా బాదంపప్పును తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంటుందట. ఇందులో ఫైబర్ విటమిన్-E, మెగ్నీషియం, కాపర్, ఒమేగా త్రీ ఫాస్పరస్ వంటి పోషకాలు శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

అయితే బాదంపప్పు తినడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయట ఇందులో విటమిన్ -E పుష్కలంగా ఉండడం వల్ల ఇది చర్మం పైన ఉండేటువంటి మడతలు మచ్చలు వంటివి తొలగించేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరం బలహీనత కూడా లేకుండా చేస్తుంది. బాధకు గింజలలో ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండడం వల్ల కొవ్వు పదార్థాలు పెద్దగా ఉండవు. చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే మధుమేహ వ్యాదిన బారిన పడ్డవారు ప్రతిరోజు కూడా కొన్ని బాధపు గింజలను తినడం వల్ల వారి ఆరోగ్యానికి చాలా మంచిదట.

తరచూ బాదం తింటూ ఉండటం వల్ల ముఖం కూడా చాలా గ్లోగా కనిపిస్తుందట. బాదం తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. బాదంపప్పులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను వేగవంతం చేస్తూ ఉంటుంది. అందుచేతనే నీటిలో నానబెట్టిన బాదం పప్పును ఉదయం పూట ఖాళీ కడుపుతో తిన్నట్లు అయితే పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో డయాబెటిస్ రోగులు తిన్నట్లు అయితే చాలా మంచిది. ఇంతే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా బాదం గింజలు దూరం చేస్తాయని చెప్పవచ్చు. బాధకు గింజలను నానబెట్టి తింటేనే పలు ప్రయోజనాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: