మధుమేహాన్ని ఈజీగా తరిమికొట్టే టిప్స్?

Purushottham Vinay
మధుమేహ బాధితులు మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం కాకరకాయ రసాన్ని తాగడం ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు. పచ్చి కాకర కాయలు తిన్నా, కాకరకాయ రసాన్ని తాగిన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయని చెబుతున్నారు. ప్రతిరోజు మనకు అందుబాటులో ఉండే, ఎప్పటికీ దొరికే చిన్న చిన్న పదార్థాలతోనే మధుమేహాన్ని కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు. అయితే ఏ మందులు వాడినా, ఏ ఇంటి చిట్కాలు ఫాలో అయినా షరతులు వర్తిస్తాయని చెప్తున్నారు. అన్నిటికంటే ముందుగా మధుమేహ వ్యాధిగ్రస్తులు అర్థం చేసుకోవాల్సింది జీవన విధానం మార్పు, ఆహార నియమాలు అని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏది పడితే అది, ఎంత పడితే అంత తినటం మానుకోవాలని సూచిస్తున్నారు.అలాగే కరివేపాకులో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు ఉంటాయని చెబుతున్నారు. 


అందుకే కరివేపాకును ప్రతిరోజు 2 రెమ్మలు తుంచుకుని తింటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు వేపాకు కూడా షుగర్ ను కంట్రోల్ చేయడంలో కీలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజు రెండు వేపాకులు తింటే కూడా మధుమేహం కంట్రోల్ లోకి వస్తుంది అని సూచిస్తున్నారు.మధుమేహ వ్యాధిగ్రస్తులు చేదు పదార్థాలను ఎంత తింటే అంత మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇక ఇంట్లోనే ఉండే మెంతులు మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. నిత్యం ఒక పరిమితిలో మెంతులను మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మధుమేహం కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. రాత్రి సమయంలో మెంతులను నానబెట్టి, ఉదయం ఆ నీళ్లను తాగి, ఆ నానిన మెంతులను తింటే కూడా మధుమేహం కంట్రోల్ లో ఉంటుందని సూచిస్తున్నారు.మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే అలోపతి మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలామంది ఆందోళన పడుతుంటారు. అలోపతి మందులతో కాకుండా మధుమేహాన్ని ఏవిధంగా కంట్రోల్ చేయవచ్చు అన్నదానిపై తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఎక్కువమంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆయుర్వేదం వైపు మొగ్గుచూపుతున్నారు. ఆయుర్వేద మందులతో, ఇంట్లోనే ఉండే ఔషధ గుణాలు ఉన్న పదార్థాలతో ఏవిధంగా డయాబెటిస్ ను కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: