దోమల నుంచి పిల్లల్ని రక్షించాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
దోమలు చాలా డేంజర్. అవి కుట్టడం వల్ల ప్రజలు రోగాలతో సతమతం అవుతున్నారు. అటు వర్షం, ఇటు చలితో దోమలు విచ్చలవిడిగా పెరుగుతుననాయి. ముఖ్యంగా పిల్లలను దోమలు తెగ కుట్టేస్తున్నాయి. వాటి నుంచి పిల్లలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కష్టమైన పనిగా మారింది. అయితే, దోమల నుంచి పిల్లలను కాపాడుకునేందుకు కొన్ని టిప్స్ ని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.దోమల నుండి పిల్లలను రక్షించడానికి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా డెంగ్యూ లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అధిక జ్వరం, వాంతులు, కంటి నొప్పి, వెన్నునొప్పి, బలహీనత, శరీరంపై ఎరుపు దద్దుర్లు డెంగ్యూ లక్షణాలుగా పరిగణిస్తారు. పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం.పిల్లలు తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. బలమైన రోగనిరోధక వ్యవస్థ పిల్లలను దోమల ద్వారా సంక్రమించే వ్యాధులబారిన పడకుండా కాపాడుతుంది. నిపుణుల సలహాతో పిల్లల ఆహారంలో పెరుగు, పసుపు, వెల్లుల్లి, బచ్చలికూర, బాదం, తాజా పండ్లను ఇవ్వొచ్చు. వీటిని తినడం వల్ల పిల్లల్లో రోగ నిరోధకశక్తి పెరగడంతో పాటు పిల్లలు ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ఉంటారు.


ఇంట్లోని గార్డెన్‌లో గానీ, బాల్కనీలో గానీ సిట్రోనెల్లా, పూదీనా, తులసి, లెమన్ గ్రాస్, క్యాట్నిప్ వంటి మొక్కలను నాటాలి. అలాగే, పిల్లలను దోమల నుంచి సురక్షితంగా ఉంచడానికి మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్ కూడా అప్లై చేయొచ్చు. అలాగే రోల్ ఆన్ లేదా స్ప్రే రిపెల్లెంట్ ఇవ్వడం ద్వారా పిల్లలను దోమల నుండి రక్షించవచ్చు.దోమల నుంచి పిల్లలను రక్షించడానికి వారికి ఫుల్ స్లీవ్ డ్రెస్సులను వేయాలి. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పిల్లలు నిండైన దుస్తులు ధరించేలా చూడాలి. అలాకాకుండా, దోమల నివారణ క్రీమ్‌ను శరీరానికి అప్లై చేయొచ్చు. అందువల్ల దోమలు కుట్టకుండా ఉంటాయి.దోమల బెడద నుంచి బయటపడాలంటే.. పిల్లలను ఇంటికే పరిమితం చేయాలి. అలాగే, పిల్లలు నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో, చెట్ల పొదలు ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా చూసుకోవాలి. పాఠశాలలో కూడా అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండమని చూసించాలి. అలా చేస్తే పిల్లలు దోమల బారిన పడకుండా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: