లైఫ్ స్టైల్: ఉసిరి వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

Divya
భారతదేశంలో ఉసిరికి, ఉసిరి చెట్టుకు పలు ప్రాముఖ్యతలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇలాంటి వస్తువుల్ని పోరుగు దేశాలలో కూడా పండించి సూపర్ ఫ్రూట్ గా ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా చలికాలంలో అసాధారణ లభించే ఒక చక్కటి పండు అని చెప్పవచ్చు. ఉసిరికాయను తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరికాయని పోషకాల రారాజు అని కూడా చెప్పవచ్చు. ఉసిరికాయ తినడం వల్ల మనం తినే ఆహారం కంటే రెండింతలు ఎక్కువ మొత్తంలో మెదడు తీరు పని చేసేలా చేస్తుంది.

ఇందులో ఆమ్లా ఫైటోన్యుట్రిమెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు  మెదడు కణాల పైన దాడి చేసి నాశనం చేస్తాయి అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ తో పోరాడడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుముఖం పడుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఇది ఒక చక్కటి దివ్య ఔషధం అని చెప్పవచ్చు ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిని పెరగనీయకుండా సహాయపడుతుంది. ఉసిరిని నేరుగా కాకుండా ఉప్పుతోనైనా కలుపుకొని తినవచ్చు. ఉసిరికాయ తిన్న తర్వాత పాలు నీరు లేదా ఏదైనా తాగినట్లు అయితే దాని రుచి మరింత పెరుగుతుందట.

ముఖ్యంగా ఉసిరికాయ పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల అదొక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఉసిరికాయ విత్తనాలు ఆరబెట్టి ఆ పొడి తో మౌత్ ప్రెషర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయ ఎక్కువగా ఎక్కడైనా పండిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కాయలను నెలలో ఒకరోజు తిన్నట్లుయితే ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కొంతమంది మహిళలు ఉసిరి చెట్టు కి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అందుచేతనే మన భారత దేశంలో ఉసిరి చెట్టుకు పలు ప్రాముఖ్యత ఉందని చెప్ప వచ్చు. ఉసిరిలో పలు పోషకాలు ఉన్నాయి కనుక అవి మన శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: