దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే?

Purushottham Vinay
మన వంటగదిలో ఉండే మసాలా దినుసులలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగున్నాయి. వీటిని సక్రమంగా ఉపయోగిస్తే చాలా వ్యాధులను.. మనకు మనమే చాలా ఈజీగా నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అందులో ఖచ్చితంగా దాల్చిన చెక్క ఒకటి. దాల్చిన చెక్క ఆరోగ్యానికి  చాలా మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అనేక సమస్యలను దూరం చేస్తాయి. దాల్చిన చెక్క వేడి రుచిని కలిగి ఉంటుంది. కావున దీనిని ఎక్కువగా శీతాకాలంలో ఉపయోగిస్తారు. దాల్చినచెక్క రెసిపీని సరైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..దాల్చినచెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు పని చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు.దాల్చిన చెక్క మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించడంలో పని చేస్తాయి.

పప్పు , పంచదార లాంటివి ఏదైనా చిటికెడు వేసి తీసుకుంటే.. వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.దాల్చిన చెక్క బరువును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగవచ్చు. చలికాలంలో దాల్చిన చెక్కను తీసుకుంటే ఇతర వ్యాధులతో పాటు ఊబకాయం కూడా దూరమవుతుంది.దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. దీని వినియోగం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాల్చిన చెక్క మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పనిచేస్తుంది.డయాబెటిస్‌లో దాల్చిన చెక్క కూడా మేలు చేస్తుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. రోజూ చిటికెడు దాల్చిన చెక్కను తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.దాల్చినచెక్కలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం లాంటి సమస్యలు దూరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: