లైఫ్ స్టైల్: బెండకాయలలో ఏది మన ఆరోగ్యానికి చాలా మంచిది..!!

Divya
మనం ఎక్కువగా గ్రీన్ కలర్ లో ఉండే బెండకాయలనే చూస్తూ ఉంటాము. కానీ ఎర్ర బెండకాయలు చూడడం చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఇందులో వీటిని తిన్నవారు చాలా తక్కువ. ఎరుపు ఆకుపచ్చ బెండకాయ పోషకాలు ఎక్కువగా ఏమిట్లో ఉంటాయో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి మాంసాహారం కంటే కాయగూరలు ఎక్కువగా పోషకాలను కల్పిస్తాయి. మన శరీరానికి కావలసిన పలు పోషకాలు అందుతాయి. అందుచేతనే వైద్యులు కూడా ఎక్కువగా కూరగాయలు తింటూ ఉండమని సలహా ఇస్తూ ఉంటారు.

ఇకపోతే కూరగాయలలో ఒకటైన బెండకాయ గురించి అందరికీ తెలుసు. ఎరుపు బెండకాయలను చాలా తక్కువగా పండిస్తూ ఉంటారు. నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఆకుపచ్చ బెండకాయల కంటే ఎరుపు రంగులో ఉండే బెండకాయలే ఆరోగ్యానికి చాలా మంచిదట. ఇందులో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చ బెండకాయ కు క్లోరోఫిల్ కారణంగా ఆ రంగులోకి వస్తూ ఉంటాయి. ఎరుపు రంగు బెండకాయలు అంధో సైనిన్ స్వర్ణ ద్రవ్యంతో ఎరుపు రంగులోకి మారుతూ ఉంటుంది. ఎరుపు బెండకాయలో ఐరన్, హిమోగ్లోబిన్ 30 శాతం పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఎరుపు రంగు బెండకాయలలో విటమిన్ బి, ఫోలేట్ వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గర్భిణులకు చాలా అవసరం. వీటిని తినడం వల్ల పెరుగుతున్న బిడ్డలను కూడా చాలా ఆరోగ్యంగా ఉంచెలా చేస్తాయి. ఎర్ర బెండకాయలు ఎక్కువగా తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు ఎర్ర బెండకాయ తప్పకుండా తింటూ ఉండాలి. ఎందుకంటే ఇది రక్తపోటు నియంత్రిస్తుంది. ఎరుపు బెండకాయలలో నియాసిన్, విటమిన్లు, థయామీన్ వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. ఈ బెండకాయలలో గ్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. గుండెను చాలా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: