లైఫ్ స్టైల్: హైపర్ థైరాయిడ్ సమస్యకు ఇలా చెక్ పెట్టండి..!

Divya
సరైన పోషకాహారం లేకపోవడం , ఒత్తిడి వంటి జీవనశైలి కారణాలవల్ల జెండర్ తో సంబంధం లేకుండా అన్ని వయసుల మహిళలు, పురుషులు కూడా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. పోషకాహారం జీవన శైలి కారణాలవల్ల స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వైద్యులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీ ఆహారంలో క్రమం తప్పకుండా కొన్నింటిని చేర్చుకోవడం చాలా ముఖ్యం.

ఉసిరికాయ:
ఉసిరికాయలు రోగనిరోధక శక్తిని పెంచడానికి వ్యాధులతో పోరాడడానికి సహాయపడే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇందులో నారింజ కంటే 18 రెట్లు ఎక్కువ విటమిన్ సీ.. దానిమ్మ పండు కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది తలకు రక్తప్రసరణ పెంచడం ద్వారా జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.  థైరాయిడ్ రోగులకు ఉసిరి చాలా ప్రయోజన కారి అని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి:
కొబ్బరిని పచ్చిగా లేదా ఉడికించి తినడం వల్ల థైరాయిడ్ రోగులకు అద్భుతమైన ఆహారం కాబట్టి .. దీనిని తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా పచ్చి కొబ్బరిలో MCFA, MTC లు ఎక్కువగా రెండూ వుంటాయి.ఇవి జీవక్రియలో ఎక్కువగా సహాయపడతాయి.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడి గింజలలో  జింకు పుష్కలంగా ఉంటుంది. శరీరం ఇతర విటమిన్లు, ఖనిజాలు గ్రహించడం , థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, సమతుల్యత కోసం  ఇది చాలా అవసరం.
బ్రెజిల్ గింజలు:
సెలీనియం థైరాయిడ్ హార్మోన్ జీవక్రియకు అవసరమైన సూక్ష్మ పోషకం . రోజుకు మూడు బ్రెజిల్ గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ థైరాయిడ్ ఖనిజం లభిస్తుంది.
పెసలు:
ఇందులో ప్రోటీన్లు , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.  అంతేకాదు విటమిన్లు,  మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరాన్ని కావాల్సిన అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా మలబద్దకంతో బాధపడే వారికి కూడా మంచి ప్రయోజన కారిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: