కిడ్నీ జబ్బుకి ఈ అలవాట్లే కారణం?

Purushottham Vinay
మీరు రోజూ ఆల్కహాల్ తీసుకుంటే, మీ ఈ అలవాటును వదిలివేయండి. దీని వల్ల మీ కిడ్నీ పాడైపోవచ్చు.ధూమపానం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మాత్రమే కాకుండా, మీ మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. అధిక మొత్తంలో ధూమపానం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.చక్కెర స్థూలకాయానికి కారణమవుతుంది. చక్కెర ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల మీ కిడ్నీ పాడైపోవచ్చు.మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో అధిక మొత్తంలో ఆమ్లాన్ని ఉత్పత్తి అవుతుంది. ఇది మూత్రపిండాలకు హానికరం. అలాగే అసిడోసిస్‌కు కారణమవుతుంది. అందుకే కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం ఎక్కువగా తీసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా లేకుంటే ఆ ప్రభావం కిడ్నీలపై పడే అవకాశం ఉంది. రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి.కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి మంచి ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తగినంత నీరు తాగకపోతే కిడ్నీ స్టోన్ వచ్చే అవకాశం ఉంది.


అందుకే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.ప్రాసెస్ చేసిన ఆహారాలలో సోడియం, ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇవి మీ కిడ్నీలకు చాలా హానికరం. ఇది కాకుండా అధిక భాస్వరం తీసుకోవడం మీ మూత్రపిండాలు, ఎముకలకు హానికరం.ఉప్పు అధికంగా తీసుకోవడం ప్రమాదకరమేనంటున్నారు వైద్య నిపుణులు. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. మీ మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఉప్పుకు బదులుగా మూలికలు, సుగంధ ద్రవ్యాలతో మీ ఆహారాన్ని చేర్చుకోవడం ఎంతో మంచిదని సలహా ఇస్తున్నారు.కీడ్నిల్లో నొప్పి కారణంగా చాలా మంది రకరకాల మందులను వాడుతుంటారు. మీరు వైద్యుడిని సంప్రదించకుండా ఎక్కువ నొప్పి నివారణ మందులు తీసుకుంటే అది మీ కిడ్నీలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా మీకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే నొప్పి నివారణ మందులు తీసుకోవడం మానుకోండి. వైద్యుని సలహా మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: