లైఫ్ స్టైల్: గ్రీన్ జ్యూస్ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

Divya
ఈ మధ్యకాలంలో అందరు శరీరాన్ని ఫిట్ గాను ఆరోగ్యంగాను ఉంచుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అలాంటివారు కూరగాయలు, ఫ్రూట్స్, సలాడ్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి గ్రీన్ జ్యూస్ వల్ల ఉపయోగాలు తెలిస్తే, అసలు తాగకుండా ఉండలేరు. ఈ గ్రీన్ జ్యూస్ వల్ల మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం..
 ఇన్ఫ్లమెషన్ తగ్గించుకోవడానికి..
శరీరంలోని కీళ్ళనొప్పులు,తలనొప్పి, బాడీ యాక్నె, చిరాకు, డయాబెటిస్, నరాల బలహీనత వంటి ఇన్ఫ్లమెషన్ గుణాలను తగ్గించుకోవడానికి ఈ గ్రీన్ జ్యూ స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఉదయాన్నే లేవడానికి నీరసం,నిరసత్వగా అనిపించేవారు, గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల ఇందులో వున్న మెగ్నీషియం ఉదయం లేచినప్పుడు ఉండే ఆసిడిక్ ఫీలింగ్ తగ్గించి,శరీరం యాక్టివ్ గా పనిచేసేలా ప్రోత్సాహస్తుంది. మెదడుకు చురుగ్గా, ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తుంది. ఈ జ్యూస్ లో ఉన్న ప్రోబయాటిక్క్స్ వల్ల
 జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణశయంలోని మంచి బ్యాక్టీరియా పెంచడానికి ఉపయోగపడుతుంది.ఇందులో వున్న యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
 గ్రీన్ జ్యూస్ లో వాడే పాలకూరలో పోలిక్ యాసిడ్, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల రక్త హీనతతో బాధపడే వారికి, హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది.దీనిలోని డీటాక్స్పై గుణాలు వల్ల శరీరంలో గల మలినాలను శుభ్ర పరచి,యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది.
ఈ జ్యుస్ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీని పెంచి ఎలాంటి రోగాలు రాకుండా, బ్యాక్టీరియతో పోరాడుతుంది. అంతేకాక మనం తిన్న ఆహారం నుంచి ఐరన్ ను బాగా అబ్జర్బ్ చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. దీనిని పరగడుపున కాఫీ,టీ బదులుగా తీసుకోవడం వల్ల, రోజకంత కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తుంది. ఈ జ్యూస్ త్రాగటం వల్ల పొట్ట నిండి నట్టు ఉండి తొందరగా ఆకలి వేయదు. అందువల్ల ఎక్కువగా తినలేక పోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని డి హైడ్రెట్ కాకుండా కాపాడుతుంది.
ఈ జ్యూస్ చేసుకోవడానికి కావాల్సినవి..
పాలకూర,గ్రీన్ యాపిల్ ను స్టీమ్ చేసి వుండికించి,అవకాడోను ముక్కలుగా చేసి మిక్స్ చేసుకోవాలి. దీనికి ఒక స్ఫూన్ నిమ్మ రసం, ఒక స్ఫూన్ తేనే కలిపి తీసుకోవాలి.దీనిని పరగడుపునే త్రాగడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: