లైఫ్ స్టైల్: డయాబెటిస్ ను నియంత్రించే అద్భుతమైన మెడిసిన్..!

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఇలా మధుమేహం వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. ముఖ్యంగా అధిక గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే రోజూ తీసుకునే ఆహారంలో కూడా కేవలం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు.

ఇకపోతే మధుమేహాన్ని నియంత్రించే అద్భుతమైన మెడిసిన్ ఏమిటంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు చెప్పాలి. మధుమేహం ఉన్నవారు తాజా కూరగాయలను తీసుకొని శనగపిండిలో వేసి తీసుకుంటే శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలగడమే కాకుండా మధుమేహం సులభంగా నియంత్రణలోకి వస్తుంది. అలాగే గుడ్లలో కూడా ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.  అంతేకాదు ఆరోగ్యంగా ఉండడానికి ఆమ్లెట్లను తయారు చేసుకొని తింటే మరింతగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయట.
మెంతి ఆకులు కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీ డయాబెటిస్ లక్షణాలు అధిక పరిమాణంలో లభించడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.  ఇక మెంతికూరతో తయారు చేసే దేనినైనా సరే మీరు ఆహారంలో ఒక భాగం చేసుకోవచ్చు. మొలకలు కచ్చితంగా తినాలి.  ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గిస్తాయి.  అలాగే మొలకలను దోసెల లాగా వేసుకొని తింటే మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక ఇవే కాకుండా ఓట్స్ ఆమ్లెట్ కూడా మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: