లైఫ్ స్టైల్:ధనియాలు ,బెల్లం కలిపి తినడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Divya
ప్రతి ఒక్కరు రోజూ బెల్లం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటాం. కానీ కొంతమంది లావు అవుతారని తీపి పదార్థాలను తినకుండా వుంటారు. కానీ బెల్లంలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారు రోజూ చిన్న బెల్లం ముక్క తింనడం వల్ల, ఇందులో వున్న ఐరన్ కంటెంట్ వల్ల రక్త వృద్ధికి సహాయ పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినమని చెబుతుంటారు.

అలాగే ధనియాలలో కూడా శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కళంగా దొరుకుతాయి. ధనియాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది .ఇందులో యాంటీ బయటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇటువంటి ఎన్నో ఉపయోగాలు కలిగి ఉన్న బెల్లం,ధనియాలను కలిపి తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ధనియాలు, బెల్లం కలిపి తినడం వల్ల కండరాల నొప్పులు, కీళ్లనొప్పులకు ఉపశమనం కలుగుతుంది.ఇందులో ఉండే క్యాలిషియం ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి దోహధపడతాయి.వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించి ఆస్తియో పోరోసిస్ వంటి రోగాలు రాకుండా కాపాడుతాయి.కొంతమంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. అలాంటి వారు  బెల్లం,ధనియాలు కలిపి తినడం వల్ల నోటిదుర్వాసన తగ్గటమే కాకుండా దంత సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఇప్పుడున్న జీవన విధానం వల్ల చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు,బెల్లం,ధనియాలను రాత్రి పడుకోబోయే ముందు తినడం వల్ల మలబద్ధకం తొందరగా తగ్గిపోతుంది. జీర్ణ క్రియ మెరుగుపడి గ్యాస్,కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి పొట్ట సమస్యలు తొలగిపోతాయి.

ఇందు కోసం …ధనియాలను సన్నని మంటపై వేయించి మెత్తని పొడిగా చేసుకోవాలి.మరియు పొయ్యి మీద చిన్న గినన్నే లో ఒక గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ ధనియా పొడిని వేసి బాగా మరిగించి కషాయం లా చేసుకోవాలి. తర్వాత అందులో ఒక టీ స్ఫూన్ బెల్లం పొడి వేసి మరీ మరిగించి ఆ నీటిని వడకట్టి త్రాగాలి.దీనిని తరుచుగా పరగడుపున టీ, కాఫీ బదులుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: