అజీర్ణం సమస్య తగ్గే ఈజీ టిప్?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో అజీర్ణం సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే దీనికి తగిన చికిత్స చేయకపోతే అది విపరీతమైన నొప్పి, వికారం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇందుకోసం పూర్తిగా మందుల మీద ఆధారపడకూడదు. ఎందుకంటే మందులు తాత్కాలికంగా సమస్యను పరిష్కరించవచ్చు. కానీ, దీర్ఘకాలంలో పెద్దగా ఉపయోగపడవు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ కడుపుని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడే అనేక సహజమైన ఆహారాలు, పానీయాలు ఉన్నాయి. వాటిలో తమలపాకులు కూడా ఒకటి.తమలపాకుల్లో కార్మినేటివ్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్, యాంటీ ఫ్లాట్యులెంట్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇది లాలాజలం విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణక్రియ మొదటి దశ. ఎందుకంటే, ఇందులోని వివిధ ఎంజైములు ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఇది సులభంగా జీర్ణం చేస్తుంది. తమలపాకుల నుండి నూనెను తయారు చేసి మీ కడుపుపై మసాజ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్‌లు, జీర్ణ ఆమ్లాల స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది.తమలపాకులలో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ వంటి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.


కాల్షియం  మంచి మూలం. ఈ యాంటీ ఆక్సిడెంట్లు పొట్టలోని pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగండి లేదా నానబెట్టిన తమలపాకులను నమలండి. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది.భోజనం తర్వాత సాధారణంగా పాన్ తినడానికి సమీపంలోని పాన్ షాపులకు వెళ్తారు. కానీ, కొందరు వ్యక్తులు గుల్కంద్, తరిగిన వాల్‌నట్‌లు, పొడి వేయించిన ఆవాలు, కొబ్బరి పొడి, తేనె, లవంగాలు, యాలకుల గింజలను కలుపుతారు. కొంతమంది ఈ పాన్‌ను ఇంట్లో కూడా తయారు చేసి తింటారు. ఇది అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, భోజనం తర్వాత పాన్ నమలడం వల్ల జీర్ణ రసాల స్రావాన్ని పెంచుతుంది. కాబట్టి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పేగు పరాన్నజీవులను నాశనం చేస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: