గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది?

Purushottham Vinay
గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం చాలా కాలంగా తెలుసుకుంటూనే ఉంటున్నాం. గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. అలాగే ఎప్పుడు తాగితే మంచిది ఇంకా ఎప్పుడు తాగితే ప్రమాదమో కూడా తెలుసుకుందాం.బరువు తగ్గడం కోసం గ్రీన్ టీని తాగుతున్నట్లయితే, తేనె, నిమ్మకాయ, పుదీనా ఆకులు, దాల్చిన చెక్క లేదా అల్లం కలిపి తీసుకోవచ్చు. ఈ పదార్థాలన్నీ ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తూనే.. అలాగే బరువు తగ్గడంలోనూ సహకరిస్తాయి.ఈ గ్రీన్ టీని వ్యాయామం తరువాత తీసుకోవడం వల్ల కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.గ్రీన్ టీలో ఎపిగాల్లో కాటెచిన్ గాలేట్ (EGCG) ఉంది. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.కాటెచిన్స్ అనేది గ్రీన్ టీలో కనిపించే ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.


వ్యాయామం తరువాత ఫ్రీ రాడికల్స్ తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇది వాపు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది.ఫిట్ నెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు సాధారణంగా తీసుకునే ఆహారంగా గ్రీన్ టీని ఎంచుకోవచ్చు. గ్రీన్ టీని తాగడం వల్ల వ్యాయామం తరువాత శరీరం రిలాక్స్ అయిన ఫీలింగ్ ని ఇస్తుంది. ఇది గుండె రేటును తగ్గిస్తుంది. అయితే ఔషదం తీసుకున్న వెంటనే.. ఔషదం తీసుకున్న తర్వాత గ్రీన్ టీ త్రాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇది హానికరం.గ్రీన్ టీ జీర్ణక్రియను మెరుగుపరిచినప్పటికీ, భోజనం తర్వాత తాగడం వల్ల భోజనం నుంచి అందే పోషకాలను గ్రహించడం తగ్గుతుంది.ఉదయం పూట ముందుగా గ్రీన్ టీ తాగకండి. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. నిద్ర సమస్యలతో పోరాడుతున్నట్లయితే నిద్రవేళకు ముందు లేదా నిద్రవేళలో గ్రీన్ టీని తీసుకోకండి. ఇది కెఫిన్ కలిగి ఉంటుంది. ఇది సిర్కాడియన్ రిథమ్ కు భంగం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: