షుగర్: గుడ్ న్యూస్.. ఈ వంటింటి పదార్ధంతో మాయం?

Purushottham Vinay
ప్రపంచంలో చాలా ఎక్కువ మంది బాగా ఇబ్బంది పడుతోన్న ఆరోగ్య సమస్యలో ఖచ్చితంగా డయాబెటిస్‌ ఒకటి. మరీ ముఖ్యంగా భారత్ లో ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య అయితే రోజురోజుకీ చాలా వేగంగా పెరిగిపోతోంది.2019 వ సంవత్సరపు లెక్కల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే భారత్‌లో 70 మిలియన్లకుపైగా మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 వ సంవత్సరం నాటికి ఈ సంఖ్య డబుల్ కానుందని అంచనా వేస్తున్నారు. వీటిలో టైప్‌-2 డయాబెటిస్‌ కేటగిరీనే అధికమని చెబుతున్నారు.ఇక మధుమేహం వ్యాధిని అడ్డుకట్ట వేయడానికి రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. ఆహార నియమాల్లో మార్పులు చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉల్లిపాయ షుగర్‌ వ్యాధికి దివ్యౌషధంగా ఉపయోగపడుతుందనేది సదరు పరిశోధన సారంశం. ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయ అధిక చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ స్థాయిలను కంట్రోల్‌ చేస్తుందని పరిశోధనలో తేలింది. ఉల్లిపాయను పోషకాహార సప్లిమెంట్‌గా కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.


ఉల్లిపాయలను సలాడ్‌ రూపంలో తీసుకుంటే రుచితో పాటు, ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. ఉల్లిపాయ, దోస ముక్కలు, టమాట ముక్కలను కట్ చేసుకొని వాటిపై ఉప్పు, కారం వేసి తీసుకోవచ్చు. అలాగే ఉల్లి రసాన్ని తాగిన ప్రయోజనం ఉంటుంది.ఇక శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగాయన్న విషయాలన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా తరచుగా మూత్ర విసర్జన చేయడం, దాహం వేయడం, ఉన్నపలంగా బరువు తగ్గడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు రావడం, గాయాలు త్వరగా మానకపోవడం, విపరీతమైన అలసట, ఆకలి తగ్గడం, చర్మంలో రంగులు మారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న టిప్స్ పాటించండి. షుగర్ సమస్య నుంచి విముక్తి పొందండి.ఎందుకంటే షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చచ్చే దాకా కూడా పోదు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోని సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: