లైఫ్ స్టైల్ : వంటింట్లో ప్రెషర్ కుక్కర్ పనిచేయడం లేదా.. అయితే ఇలా చేయండి..!

Divya
ఈమధ్య కాలంలో ప్రెషర్ కుక్కర్ లేని వంటిల్లు లేదని చెప్పడంలో సందేహం లేదు. ఇక చాలామంది వంటింట్లో ప్రెషర్ కుక్కర్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ వంటను సులభంగా తొందరగా చేయడంతో పాటు గ్యాస్ ని కూడా ఆధా చేస్తుంది. అంతేకాదు మీ సమయాన్ని కూడా ఆధా చేస్తుందని చెప్పవచ్చు. అందుకే చాలామంది గృహిణులు తమ వంటింట్లో ప్రెషర్ కుక్కర్ కు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. ఇకపోతే కొన్ని కొన్ని సార్లు ప్రెషర్ కుక్కర్ సరిగా పనిచేయదు. అప్పుడు మెయింటెనెన్స్ తప్పకుండా అవసరం అవుతుంది. భోజనం కూడా వేగంగా రెడీ చేయడంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
సాధారణంగా మనం వాడుతున్న ప్రెషర్ కుక్కర్ రోజులు జరిగే కొద్దీ కుక్కర్లు పాతవి అవుతూ ఉంటాయి. ఇక ప్రెజర్ బిల్డప్ కూడా  సాధ్యం కాదు. అన్నింటిలోని కుక్కర్ కి కూడా రిపేరు చేయించాల్సి అవసరం ఉంటుంది . మీరు కుక్కర్ ను మంచిగా చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలను ఉపయోగిస్తే.. ఎప్పటిలాగే మీ ప్రెషర్ కుక్కర్ ను ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా మనం చేసే చిన్న పొరపాట్లే వంటపాత్రుల పనితీరును దెబ్బతీస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
వంట చేస్తున్నప్పుడు కుక్కర్ మూత నుంచి ఆవిరి నీరు కారుతున్నట్లు చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కుక్కర్ మూత వంకరగా మారవచ్చు . ఇలా జరిగినప్పుడు మీరే సరి చేసుకోవడం అసలు మంచిది కాదు. మార్కెట్లోకి వెళ్లి మెకానిక్ తో మరమ్మతులు చేయించడం వల్ల ప్రెషర్ కుక్కర్ సరిగ్గా పనిచేస్తుంది. కుక్కర్లో ప్రెషర్ సరిగ్గా ఉంటే ఆహారం త్వరగా రెడీ అవుతుంది. ఇక కుక్కర్లో ప్రెషర్ లేకుంటే పనిచేయడం మానేసినట్టే .. ఇలాంటి సమయంలో రబ్బర్ ను బయటకు తీసి ఎక్కడైనా పాడయిందో లేదో చెక్ చేసి చూడాలి. ప్రతి రెండు లేదా నాలుగు నెలలకు ఒకసారి ప్రెషర్ కుక్కర్ రబ్బర్ ను మారుస్తూ ఉండాలి.ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రెషర్ కుక్కర్ ను రిపేర్ చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: