లైఫ్ స్టైల్: రోగాలను దూరం చేసే అంజీరా..తింటే ఎన్ని లాభాలో..!

Divya
ముఖ్యంగా సహజంగా పోషకాలు లభించే పండ్లలో అంజీర కూడా ఒకటి.  ఇక ఈ అంజీర పండులో ఎన్నో ఔషధ గుణాలు లభిస్తాయి.  ముఖ్యంగా అంజీర పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు అంజీరా పండ్లను ప్రతిరోజు పాలలో కలుపుకొని తినడం వల్ల సమస్య నుంచి అధిగమించవచ్చు. ఇకపోతే అంజీర పండ్లను పచ్చి వాటితో పాటు ఎండిన అంజీర పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.  ముఖ్యంగా చిరాకు తొలగిపోవడం , బరువు తగ్గడం ఇంకా ఎన్నో సమస్యలను దూరం చేయడంలో అంజీర పండ్లు సమర్ధవంతంగా పనిచేస్తాయి.
అంజీర పండ్ల లో మెగ్నీషియం,  ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఎన్నో ప్రయోజనకరమైన పోషకాలు లభిస్తాయి. అంతేకాదు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్,  విటమిన్స్ , ప్రోటీన్ లకు మంచి మూలం. ఇక ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు. అంజీరా పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇక అంజీర పండ్లలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలహీనంగా ఉన్నా ..  ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా లభించడం వల్ల ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక పొటాషియం, మెగ్నీషియం , మినరల్స్.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి గుండెను దృఢంగా మారుస్తాయి. ఒమేగా 3,  ఫ్యాటీ ఆమ్లాలు కొవ్వు ఆమ్లాలు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి.  కరోనరీ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇక అంజీర పండు తినడం వల్ల గ్యాస్ , ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి.
ముఖ్యంగా పిల్లలు రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ అంజీర పండ్లు చాలా చక్కగా పనిచేస్తాయి. ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టి వాటిని ఉదయాన్నే మిక్సీ పట్టి పాలలో కలిపి పిల్లలకు అలాగే పెద్దలకు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత సమస్య దూరం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: