లైఫ్ స్టైల్: ప్రతిరోజు రెండు ఖర్జూరాలను తింటే ఏమవుతుందో తెలుసా..?

Divya
ఖర్జూరం ఐరన్ కి మూలం అని చెప్పవచ్చు. ఐరన్ లోపంతో బాధపడేవారు ప్రతిరోజు రెండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టుకొని తిన్నా లేదా డైరెక్ట్ గా తిన్నా సరే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇకపోతే ఇటీవల కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం జీవన విధానంలో వచ్చే మార్పులు.. శారీరక శ్రమ లేకపోవడం.. మోనోపాజ్ .. చేసే పనిలో ఒత్తిడి.. బేకరీ ఫుడ్స్.. ఫాస్ట్ ఫుడ్.. వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా అధిక బరువుకు కారణం అవుతుంది. ముఖ్యంగా అధిక బరువు అనేది బరువు పెరగడమే కాదు పొట్ట కూడా బాన లా తయారవుతుంది. దీనిని తగ్గించుకోవడానికి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి ఖర్జూరాలు చాలా బాగా సహాయపడతాయి.

ముఖ్యంగా ఖర్జూరాలలో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్ , క్యాల్షియం,  ఐరన్ వంటి పోషకాలు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఖర్జూరాలలో ప్రక్టోస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి తీయగా ఉండడానికి కారణం. ఇకపోతే బరువు తగ్గాలనుకునే వారు ఖర్జూర పండ్లతో ఇలా చేశారంటే మంచి ఫలితం లభిస్తుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క,  పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సొంటిపొడి,  రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ జీలకర్ర పొడి,  ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి.  ఇప్పుడు రెండు ఖర్జూరాలు తీసుకొని నిలువుగా కట్ చేసి వాటిలో ఉండే గింజలను తీసివేయాలి.
ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టి ఇలా ఖర్జూరాలను ప్రతిరోజు ఉదయం తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. అంతేకాదు కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. రక్తహీనత సమస్య దూరం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది . ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: