లైఫ్ స్టైల్: ఉదయం పూట టి.. కాఫీ తాగుతున్నారా.. అయితే ఇక అంతే..!!

Divya
మారుతున్న జీవితకాలమానుగుణంగా ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ కూడా మారుతూ ఉంటోంది.. సమయం లేకనో పని ఒత్తిడి వల్లో కానీ టైమ్ ప్రకారం తినకపోవడం వంటివి చేస్తూ ఉంటారు.. ఇక దీనివల్ల గ్యాస్ సమస్యలు, తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు వంటివి వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కడుపులో యాసిడేటి ఎక్కువగా అవ్వడం వల్ల పలు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేల కాని వేళలో జంక్ ఫుడ్ ,ఆల్కహాల్, కూల్ డ్రింక్ తదితర కారం వంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా ఉదయం కాఫీ, టీ వంటివి తీసుకోవడం వల్ల పేగులలో మంట వస్తుందట.

ఇక త ద్వారా మైగ్రేన్ వంటి సమస్యలు కూడా ఎక్కువగా విచ్ఛిన్నమవుతాయని తెలియజేయడం జరిగింది. అందుచేతనే వీలైనంతవరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచండిని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఉదయం లేవగానే టీ,కాఫీ లకు బదులుగా. నిమ్మరసం తేనె, పుదీనా, తులసి నీళ్ళు తదితర వాటితో చేసిన డ్రింక్స్ తాగడం వల్ల చాలా మంచిదట. అతిగా టీ తాగడం వల్ల కిడ్నీలలో రాళ్లు కూడా ఏర్పరుతాయి.

ప్రతిరోజు 5 కప్పుల కంటే ఎక్కువ టీ ని తాగినట్లు అయితే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.. ఇక ఎక్కువ మోతాదుకు మించి తాగితే ఎముకలలో బలత్వం కోల్పోతాయి దీంతో అవి పెలుసుగా మారి త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక అంతే కాకుండా గుండె కొట్టుకొనే వేగం కూడా ఎక్కువగా పెరుగుతుంది దీనివల్ల ఎసిడిటీ సమస్యలు పెరగడమే కాకుండా.. జీర్ణ వ్యవస్థ సమస్యలు దెబ్బతింటాయి. ముఖ్యంగా 10 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు కాఫీ,టీ ని తాగకపోవడమే చాలా మంచిది ఇందులో ఎక్కువగా కెఫిన్ ఉండడం వల్ల శరీరంలో నిల్వ ఉండే పోషకాలను నాశనం చేస్తుంది. కేవలం ఒక కప్పు టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: