ఈ పప్పు తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
పప్పు ధాన్యాల్లో ప్రొటీన్ చాలా పుష్కలంగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. నాన్ వెజ్ తినని వాళ్లకు పూర్తి వెజ్ పదార్థాలను మాత్రమే తీసుకునేవారికి తగినంత ప్రొటీన్ అనేది ఖచ్చితంగా అందాలంటే తప్పకుండా డైట్ లో పప్పు ధాన్యాలను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎక్కువగా సూచిస్తుంటారు.పప్పులో ప్రోటిన్‌ తో పాటు విటమిన్స్‌ ఇంకా మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కంది పప్పు, ఎర్ర కంది పప్పు, శనగ పప్పు, బఠాణీలు, చిక్కుడు, పెసర పప్పు, బొబ్బర్లు ఇంకా అలాగే మినప్పప్పు ఇలా పప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవి కేవలం అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా మంచి పోషక పదార్ధాలు కూడా ఉంటాయి. అయితే పప్పుల్లో పెసర పప్పు గురించి ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆయుర్వేదంలో పెసర పప్పు ను ‘క్వీన్‌ ఆఫ్‌ పల్సెస్‌ ‘ అని పేర్కొన్నారు. పెసర పప్పులో ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్-బి6, నియాసిన్ ఇంకా అలాగే ఫోలేట్ అనేవి ఉంటాయి. పెసర పప్పును క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన పప్పులతో పోలిస్తే పెసర పప్పు చాలా త్వరగా జీర్ణమవుతుంది. ఇంకా అలాగే తక్కువ మొత్తంలో గ్యాస్‌ ఉత్పత్తి చేస్తుంది.


పెసర పప్పును వండే ముందు నానబెడితే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచించారు. ఇలా చేయడం వల్ల వాటి నుంచి ఫైటిక్ యాసిడ్ తొలగి మరింత సులభంగా జీర్ణం అయ్యేందుకు చాలా బాగా సహాయపడుతుంది.డయాబెటిక్‌ పేషెంట్స్‌ పెసర పప్పును డైట్ లో భాగం చేసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి బాగా అదుపులో ఉంటాయి. పసర పప్పులో యాంటీ ఆక్సిడెంట్ ఇంకా యాంటీ డయాబెటిక్ లక్షణాలు అనేకం ఉన్నాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని కూడా బాగా తగ్గిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. అలాగే ఆకలిని  కూడా నియంత్రిస్తుంది.ఇంకా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశాలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. పెసరపప్పు శరీరంలో మంట ఇంకా నొప్పిని తగ్గిస్తుంది. అర్థరైటిస్‌ సమస్య ఉన్నవారు పెసర పప్పు తింటే నొప్పి నుంచి ఈజీగా ఉపశమనం అనేది లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: