లైఫ్ స్టైల్: నీరసంగా ఉన్నారా ?అయితే ఈ సూపర్ డ్రింక్ మీకోసమే..?
ఇకపోతే ఈ డ్రింక్ కోసం మీరు ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్.. వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి. తర్వాత బ్లెండర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలు, నానపెట్టుకున్న చియా సీడ్స్ , ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్, నాలుగు నానపెట్టి పొట్టు తొలగించుకున్న బాదం పప్పులు, నాలుగు పిస్తా పలుకులు ,నాలుగు గింజలు తొలగించిన ఖర్జూరాలు, అరకప్పు అరటిపండు ముక్కలు, ఒక అవకాడో పల్ప్, ఒక గ్లాస్ వాటర్, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి నాలుగైదు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి .ఇక ఈ ప్రోటీన్ డ్రింక్ ను మీరు ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున వారం రోజులపాటు తీసుకున్నట్లయితే నీరసం మొత్తం ఇట్టే ఎగిరిపోతుంది.
ఇక మీరు ఎనర్జీగా ఉండటమే కాకుండా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ డ్రింక్ చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. అతి ఆకలి దూరం అవుతుంది. మెటబాలిజం రేటు పెరిగి మీ శరీరంలో అధికంగా ఉన్న క్యాలరీలు కూడా తగ్గిపోతాయి.