ఇలా చేస్తే బొద్దింకల సమస్య ఉండదు?

Purushottham Vinay
ఇక మన ఇళ్లు అలాగే స్టోర్‌ రూంలలో బొద్దింకలు అనేవి చాలా కామన్ గా ఉంటాయి.మన ఇంటిని ఎంత క్లీన్‌గా ఉంచినా కానీ ఏదో ఒక రకంగా బొద్దింకలు అనేవి చాలా వస్తూనే ఉంటాయి. ఇక వాటిని తేలిగ్గా తీసుకుంటే... వాటి సంఖ్య అనేది అంతకంతకూ పెరుగుతుంది. మరి సహజసిద్ధ పద్దతుల్లో వాటిని ఎలా తిరిమికొట్టాలో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.బొద్దింకలకు పసుపు రంగు అనేది నలుగు రంగులా కనిపిస్తుంది. అందువల్ల పసుపు రంగు ఉన్న చోట బొద్దింకలు చాలా పెరుగుతాయి. నీటి చమ్మ ఉన్న చోట బొద్దింకలు చాలా పెరుగుతాయి. నీడగా ఇంకా చీకటిగా ఉండే ప్రాంతాల్లో అవి కాలనీలు పెడతాయి.ఇక పులావులో వేసే బే ఆకులతో మీరు చాలా తేలిగ్గా బొద్దింకల్ని తరిమికొట్టొచ్చు. కిచెన్‌లోని వేర్వేరు ప్రదేశాల్లో మీరు ఈ బే ఆకుల్ని చల్లాలి. వాటి వాసన చూస్తే చాలు ఆ బొద్దింకలు పారిపోతాయి.అలాగే లవంగాలు  వాటిని వంటగదిలోని మూలలు, డ్రాయర్లు, ర్యాకులు ఇంకా షెల్ఫులలో అక్కడక్కడా ఉంచండి. ఈ లవంగాల వాసన బొద్దింకలకు అస్సలు పడదు.


వారానికోసారి మీరు పాత లవంగాల్ని తీసేసి... కొత్త లవంగాల్ని కనుక పెడుతూ ఉంటే... ఇక బొద్దింకలు అసలు రానే రావు.ఇంకా అలాగే బోరిక్ పౌడర్, పంచదారను సమాన మోతాదులో తీసుకొని బాగా కలపాలి. ఆ పొడిని మీ వంటగదిలోని మూలల్లో చల్లాలి. అప్పుడు బొద్దింకలు అనేవి అసలు రమ్మన్నా రావు.చీకటిగా ఇంకా అలాగే ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఈ పొడి వెయ్యడం వల్ల చాలా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.అలాగే వేప ఆకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.ఈ బొద్దింకల్ని పంపించేసేందుకు... వేప నూనె ఇంకా వేప ఆకుల్ని వాడొచ్చు. వేప నూనె ఇంకా వేప పొడిని కిచెన్‌లో చల్లితే చాలు... ముఖ్యంగా రాత్రివేళ తడిగా ఉండే ఆ ప్రదేశాల్లో చల్లితే... బొద్దింకలు చాలా ఈజీగా పారిపోతాయి. ఇక ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే... బొద్దింకల సమస్య చాలా ఈజీగా తీరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: