క్యాల్షియం లోపిస్తే కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..?

Divya
క్యాల్షియం అనేది మన శరీరంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపించే అటువంటి శరీర విధులకు క్యాల్షియం అనే పోషక పదార్థం చాలా అవసరం అవుతుంది.  ఇకపోతే హార్మోన్ల స్రావం, కండరాలు , నరాల సంకోచ , వ్యాకోచాలకు తప్పకుండా క్యాల్షియం అనేది అవసరం అవుతుంది. ముఖ్యంగా అస్తిపంజరం యొక్క పనితీరు మెరుగు పడాలి అంటే క్యాల్షియం అనేది చాలా అవసరం. అయితే కొంతమందిలో కాల్షియం లోపించడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాల్షియం లోపించడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
క్యాల్షియం లోపించినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటంటే కాళ్లలో తిమ్మిర్లు,  వేళ్ళు వాపులు, పాదాల వాపులు వంటివి కనిపిస్తాయి. కండరాలకుకూడా తిమ్మిర్లు , ఒక్కసారిగా కండరాలు గట్టిగా పట్టేయడం.. నడవలేని పరిస్థితి కి చేరుకోవడం.. ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరం బలహీనంగా మారడం, బద్దకంగా అనిపించడం, గోళ్లు పెళుసుగా మారి పోవడం, దంత సమస్యలు తలెత్తడం ఇలాంటి సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా మనసు గందరగోళంగా కూడా అనిపిస్తుంది. ఇక ఆకలి మందగిస్తుంది. ఎప్పుడైతే క్యాల్షియం దీర్ఘకాలంగా లోపిస్తే అనేక ఇతర శరీర భాగాలను కూడా బాధిస్తుంది అని గుర్తించాలి. ఇప్పుడు చెప్పిన ఏవైనా లక్షణాలు మీలో అధి కంగా ఉన్నట్లయితే వెంటనే వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి.
క్యాల్షియం లోపించకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయానికి వస్తే.. పాల ఉత్పత్తులు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పెరుగు ,పులిసిన పెరుగు ,పన్నీరు , జున్ను వంటివి తీసుకోవడం వల్ల క్యాల్షియం అధికంగా లభిస్తుంది.మినరల్ వాటర్ లో కూడా మనకు కాల్షియం లభిస్తుంది. సీ ఫుడ్, కొవ్వులేని మాంసం , ఖర్జూరాలు, గుడ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇక వీటిని తీసుకోవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: