లైఫ్ స్టైల్: కంటి ద్వారానే గుర్తించగలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా మీ కంటి ద్వారా లేదా మీ శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల మీకు రాబోయే కొన్ని వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు అని వైద్యులు తెలుపుతున్నారు. ఇక ముఖ్యంగా కళ్ల ద్వారా మనం మన శరీరంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులను గుర్తించవచ్చు. సాధారణంగా కళ్ళు అన్నింటిని చూడడమే కాదు ఆరోగ్యానికి ప్రతిబింబం కూడా.. దీని గురించి అవగాహన స్పష్టత ఉన్న ఎవరైనా సరే ఒకరి ఆరోగ్యం గురించి సమస్యలను కళ్ల ద్వారా చూడవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఇక మీ కళ్ల ద్వారా లేదా మీ శరీరం లోపల మీకు వస్తున్న కొన్ని వ్యాధులను గుర్తించి దానికి కొంచెం త్వరగా వైద్య సహాయం పొందవచ్చు అని అందరికీ ఈ సలహా ఇస్తూ ఉండడం గమనార్హం.
ఇక పోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి.. వాటిని ఎలా గుర్తించ గలగాలి అనే విషయానికి వస్తే.. మొదటిది మధుమేహం.. ఇది వచ్చే ముందు దృష్టి అస్పష్టంగా కనిపిస్తుంది. టైపు 2 డయాబెటిస్ తో దృష్టికి సంబంధం కలిగి ఉంటుంది. ఇక ఇది ఎలా సాధ్యం అంటే దీర్ఘకాలిక అధిక రక్త చక్కెర స్థాయిలు రక్తనాళాల్లో అసౌకర్యాన్ని కలిగించినప్పుడు కళ్ల వెనుక భాగంలో రక్తం ముఖ్యమైన మచ్చల లా కనిపిస్తుంది. ఇక ఇలా కళ్ళలో రక్త స్రావం జరిగితే రక్తంలో చక్కెర స్థాయి తీవ్రమైన స్థాయికి చేరుకుందని గుర్తించాలి. ఇక అందుకే ఇలా కనిపించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం అయిన పని..
అంతేకాదు రొమ్ము క్యాన్సర్ లక్షణాలను కూడా మనం కళ్ల ద్వారా గుర్తించవచ్చు. శరీరంలో క్యాన్సర్ కణాలు ఇతర భాగాలకు వ్యాప్తి చెందినప్పుడు ఈ లక్షణాలు మన కళ్ల ద్వారా కనిపిస్తాయి. ముఖ్యంగా యువియా వంటి కంటి వ్యవస్థలోని అసాధారణ గాయాలు లేదా కణితులు కంటికి క్యాన్సర్ కణాలు వ్యాపించాయని సూచించడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఒక అస్పష్టమైన ద్రుష్టి తో పాటు కంటి నొప్పి కూడా మీకు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

EYE

సంబంధిత వార్తలు: