లైఫ్ స్టైల్: వంటింట్లో తప్పకుండా ఉపయోగపడే చిట్కాలు ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరికి వంటింట్లో అన్ని విషయాలు తెలియాలన్న రూలేమీ లేదు కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి.. అలాంటి వారి కోసమే మేము మీ వంట ఇంటి కోసం కొన్ని చిట్కాలను మీ ముందుకు తీసుకు రావడం జరిగింది.. ఇక ఈ చిట్కాలు తప్పకుండా మీ వంటింట్లో మీకు ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం..
1. సాధారణంగా అన్నం అడుగంటి మాడు వాసన వచ్చేటప్పుడు.. ఒక చిన్న బ్రెడ్ స్లైస్ తీసుకొని మీరు అన్న మీద పదినిమిషాల పాటు ఉంచినట్లయితే మాడు వాసన ఇట్టే పోతుంది.. ఇడ్లీ కూడా ఇదే రకమైన మాడు వాసన వచ్చినప్పుడు కూడా మీరు కేవలం బ్రెడ్ స్లైస్ ఉంచితే చాలు ఇడ్లీలు ఎప్పటికీ మాడు వాసన రావు.
2. కొద్దిరోజులపాటు ఇంటి తలుపులు , కిటికీలు మూసేసి ఎక్కడికైనా వెళుతూ ఉంటారు. తిరిగి వచ్చేసరికి ఆ ఇంటి లోపలి గాలి బయటకు వెళ్ళలేక పూర్తిస్థాయిలో ఒక రకమైన చెడు వాసన వస్తూ ఉంటుంది.ఇక ఆ దుర్వాసన  వెళ్లి పోవాలి అంటే అన్ని గదుల్లో కర్పూరం బిళ్ళలు వెలిగిస్తే చాలు చెడువాసన అంత ఇట్టే తొలగిపోతుంది.
3. ఇక సాధారణంగా దోస, ఇడ్లీ పిండి బాగా పులిసిన తరువాతనే మంచి రుచి వస్తుంది. అందుకే చాలా మంది మూడు నాలుగు రోజులకు సరిపడా పిండి ని ఒకేసారి రుబ్బుకొని రిఫ్రిజిరేటర్ లో  నిల్వ చేసుకుంటారు. ఇక పిండి మొత్తం ఒకేసారి పులిస్తే రెండోరోజు ఇడ్లీ అలాగే దోస లు కూడా బాగా రావు కాబట్టి మీరు పిండి మొత్తాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టేసి.. ఉదయానికి మీకు ఎంత అవసరమో అంత మాత్రమే ఒక గిన్నెలో తీసుకొని బయట పెట్టాలి. ఇలా చేయడంవల్ల దోశలు వేసేటప్పుడు మంచి రుచిని అందిస్తాయి.
4. ఇక అంతే కాదు మీరు ఎప్పుడు దోశలు వేసుకోవాలి అనుకున్న అంతకు ముందు రోజు కేవలం అవసరానికి సరిపడా పిండి బయట పెడితే చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో పిండి త్వరగా పులిసి పోతుంది కాబట్టి ఈ చిట్కాలు పాటించి ఎప్పటికప్పుడు కొత్త రుచిని ఆస్వాదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: