లైఫ్ స్టైల్: రాగి గింజల తో ఎన్ని లాభాలో తెలుసా..?

Divya
ప్రస్తుతం ఎండాకాలం రాకముందే ఎక్కువగా ఎండలు మండుతున్నాయి.. ఇక ఇలాంటి సమయంలో తప్పకుండా ఆహారంలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ లో రాగులు తినడం వల్ల మన శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఇక వీటితో పాటుగా అలసట కూడా తగ్గుముఖం పడుతుంది.. షుగర్ ఎక్కువ గా ఉన్నవారు కంట్రోల్ చేయడంలో రాగులు ముందు వరుసలో ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎక్కువగా మంచిది.
ఇక రాగుల లో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల క్యాన్సర్ లక్షణాలను నాశనం చేస్తుంది. అదే విధంగా యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల యవ్వనంగా ఉండడానికి రాగులు చాలా సహాయపడతాయి. రాగులలో మెగ్నీషియం, పొటాషియం బాగా ఉండటం చేత మన శరీరంలోని వేడిని తగ్గించడానికి చాలా సహాయపడుతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గించడంలో ఇవి చాలా దోహదపడతాయి. రాగుల లో ఎక్కువగా పాస్పరస్, ఐరన్ ఉండడం వల్ల రక్త శాతం పెరగడంతో పాటు హిమోగ్లోబిన్ కూడా పెంచడంలో సహాయపడతాయి.

రాగుల లో మరీ ముఖ్యంగా అమైనో యాసిడ్స్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తూ బరువుని తగ్గిస్తుంది.. రాగులలో కాల్షియం ఉండడం వల్ల ఎముకలు చాలా దృఢంగా మారుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఎదిగే పిల్లలకు ఇదొక బలమైన ఆహారం అని చెప్పవచ్చు. కిడ్నీలలో రాళ్ళు ఉన్నవారు థైరాయిడ్ రోగులు ఈ రాగు లు  తినకపోవడం మంచిది అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. రాగులను పాలిచ్చే తల్లులు తీసుకోవడం వల్ల వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక రాగి జ్యూస్ తాగడం వల్ల తలనొప్పి తగ్గడంతో పాటు బలం కూడా చేకూరుతుంది. మరిముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి బారి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: