లైఫ్ స్టైల్: గ్యాస్ ఖర్చు భరించలేకున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!

Divya
ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా గ్యాస్ సిలిండర్ మీదే అన్ని వండుకొని తింటున్నారు. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ భారం అధికంగా ఉండడం తో వీటి ఖర్చు భరించలేకుండా ఉన్నవారికి ఇప్పుడు ఇలాంటి కొన్ని టిప్స్ ఉపయోగించడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది అని చెప్పవచ్చు.. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

మనకు కుదిరినప్పుడల్లా గ్యాస్ సిలిండర్ బదులుగా మైక్రో ఓవెన్ ఉపయోగించడం మేలు. ఇక అలాగే భోజనం చేసేటప్పుడు మనం కొన్ని ఫ్రూట్స్ ను, సలాడ్ లను ఉపయోగించడం వల్ల కాస్త వంటింటి కి దూరంగా ఉండవచ్చు.
ఇక ఏదైనా వండుకోవాలి అనుకున్నప్పుడు పాత్రలు తడిగా ఉన్నప్పుడు నేరు గా స్టవ్ మీద పెట్టడం వల్ల అవి వేడి కావడానికి చాలా సమయం పడుతుంది. అందుచేతనే నీటి చుక్కలు ఉన్నప్పుడు వాటిని ఏదైనా గుడ్డతో శుభ్రంగా చేసి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టాలి.

గ్యాస్ బర్నర్ ను కనీసం వారం లో ఒక్కరోజైనా శుభ్రం చేయాలి.. అప్పుడే గ్యాస్ పైపు ద్వారా గ్యాస్ వృధా కాకుండా ఉంటుంది.
ముఖ్యంగా మనం ఫ్రిడ్జ్ లో నుంచి ఉండే పదార్థాలను వెంటనే గ్యాస్ మీద ఉంచకుండా వాటిని గది ఉష్ణోగ్రత వద్ద కాసేపు ఉంచి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టాలి.

భోజనం వండే టప్పుడు ప్రెజర్ కుక్కర్ ను ఉపయోగించడం వల్ల గ్యాస్ ఆదా చేసుకోవచ్చట. ఎందుకంటే ఈ ప్రెజర్ కుక్కర్ ఆహారాన్ని చాలా వేగంగా ఉడికేలా చేస్తుంది.

వంట చేసేటప్పుడు మీరు ఉపయోగించే పాత్ర పైన ప్లేట్ పెట్టినట్లు అయితే అతి తక్కువ సమయం లోనే ఉడుకుతుంది. అందువల్ల కాస్త గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనా వంట చేసేటప్పుడు తక్కువ మంట తోనే ఉడికించడం మేలట.
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉపయోగించుకోవడం వల్ల మనం గ్యాస్ ఆదా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: